అత్తారింటికి దారేది సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టిన దగ్గర నుంచి మహేష్ అభిమానులు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. సంక్రాంతికి నేనొక్కడినే, ఒక్కటిగా వస్తుందనుకుంటే పోటీగా 'ఎవడు' తయారైంది.
మహేష్ సినిమా కు వుండే క్రేజ్ దానికి వుంటే రామ్ చరణ్ సినిమాకు వుండే క్రేజ్ దానికీ వుంటుంది. పైగా ఎవడుకు ఫ్యామిలీ ఆడియన్స్ ప్లస్ అవుతారని టాక్. జయసుధ క్యారెక్టర్, క్లయిమాక్స్ లో ఆమె నటన మహిళలను బాగా ఆకట్టుకుంటుందని టాక్. ఇక సైకలాజికల్ థ్రిల్లర్లు ఏ క్లాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. బి సి సెంటర్లలో కేవలం మహేష్ ఇమేజ్ పైనే ఆధారపడాలి.
అయితే ఇంత హైప్ వచ్చిన తరువాత కలెక్షన్లకు ఢోకా వుండదు. అది ఏ సినిమాకైనా కూడా. కానీ ఈ లోగానే నెట్ లో అప్పుడే వన్, ఎవడు పై ఎవరికి తోచిన పోస్టులు వారు పెట్టడం, రాసేయడం ప్రారంభమైపోయింది. ఇది సినిమాల విడుదల నాటికి ఏ రేంజ్ కు చేరుతుందో?