cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్ కోసం బ్రిట్నీ స్పియర్స్

మెగాస్టార్ కోసం బ్రిట్నీ స్పియర్స్

బ్రిట్నీ స్పియర్స్ ను ప్రింట్ తీసినట్లుగా వుందిరో ఈ సుందరి..అనే సాంగ్ గుర్తుందిగా. తెలుగు పాటలోకి చేరినంత వరల్డ్ వైడ్ పాపులర్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, ఆమె ఫొటోలు మామూలుగా వైరల్ కావడం కాదు. ఓ రేంజ్ లో వుంటారు ఫాలోవర్లు.

ఇప్పుడు ఆ సింగర్ ను తెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లూసిఫర్ సినిమా ఆధారంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. 

యాజ్ యూజువల్ గా ఓ చిన్న సినిమాను మనవాళ్లు భారీ సినిమాగా మార్చేస్తున్నారు. పాటలు, ఫైట్లు ఒకటి కాదు.. ఈ సినిమా లోనే సల్మాన్ ఖాన్ కూడా నటించే అవకాశం వుందని ఏనాడో వెల్లడించాం.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో బ్రిట్నీ స్పియర్ చేత ఓ పాట పాడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. మెగాస్టార్ సూచన మేరకు ఈ సినిమాలో ఓ పాట పాడించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక పాజిబుల్ అయితే గాడ్ ఫాదర్ సినిమా క్రేజ్ మామూలుగా వుండదు.

ఈ మధ్యన తను చేస్తున్న సినిమాలు అన్నింటికీ యాడెడ్ క్రేజీ పాయింట్లు వుండేలా చూసుకుంటున్నారు మెగాస్టార్. ఓ సినిమాలో రామ్ చరణ్, మరో సినిమాలో సల్మాన్ ఖాన్ ఇలా అన్నమాట. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×