మెగాస్టార్ సినిమాలో సల్మాన్ ఖాన్ అని కాకపోయినా, సల్మాన్ ఖాన్ తో మెగా ఫ్యామిలీకి వున్న అనుబంధం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినవస్తూనే వున్నాయి.
ఇప్పుడు ఆ అనుబంధం మరింత ముందుకు వెళ్లి సల్మాన్ ఏకంగా మెగామూవీలోనే నడించబోతున్నాడని వినిపిస్తోంది.
ఆచార్య తరువాత మెగాస్టార్ చేయబోయే లూసిఫర్ రీమేక్ లో ఇప్పటికే హీరో సత్యదేవ్ ను విలన్ పాత్రకు ఎంపిక చేసారు. అదే సినిమాలో మరో మాంచి పాత్ర వుంది.
మలయాళంలో పృధ్వీరాజ్ చేసిన పాత్ర అది. చిన్న దైనా కీలకమైన పాత్ర ఇది ఈ పాత్రకు ఎవరైనా పాపులర్ లేదా టాప్ హీరో చేస్తే వచ్చే బజ్ వేరు.
అందుకే ఈ పాత్రను చేయమని సల్మాన్ ఖాన్ ను మెగాస్టార్ నే నేరుగా అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 13 లోగా సల్మాన్ నా? లేక వేరే హీరోనా అన్నది క్లారిటీ వస్తుంది.
సల్మాన్ కానీ ఓకె అంటే లూసిఫర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిపోవడం పక్కా. ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు.