మొత్తం టాలీవుడ్ లోని పలువురు హేమా హేమీలు రంగంలోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి కోసం మంతనాలు ప్రారంభించారు. ఎస్వీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారిని సంప్రదించి ఎలాగైనా అదనపు ఆటలకు అనుమతి సంపాదించే ప్రయత్నం మొదలుపెట్టారు. విపరీతంగా ఫోన్ లు వెళ్తున్నాయి. సమాధానాలు వస్తున్నాయి.
ఇలా రంగంలోకి దిగిన వారంతా ప్రో చిరంజీవి ప్లస్ వైకాపా బ్యాచ్ కావడం విశేషం. ప్రయత్నాలు చేస్తున్న వైకాపా బ్యాచ్ లోని ఒకరిద్దరని ఇదే విషయం ప్రశ్నిస్తే, సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అని, అందుకే ప్రయత్నం చేస్తున్నామని బదులిచ్చారు.
మొన్నటికి మొన్నే సాహో సినిమాకు అనుమతి ఇచ్చారు కనుక, సైరాకు కూడా ఇచ్చేస్తే ఏ మాటా వుండదని అంటున్నారు వీరు. మరి మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ చేస్తున్న ఘాటు విమర్శల మాటేమిటి? అని ప్రశ్నిస్తే, ఈ మీడియేషన్ చేస్తున్న పెద్దల నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రాకపోవడం చిత్రం.