ఎంతయినా పెరిగిన ఊరు, ఆ జ్ఞాపకాలు వేరు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక్కసారిగా ఆయన చదువుకున్న రోజుల్లోకి వెళ్లి, ఒంగోలు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో టాగోర్ మధు నిర్మించిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఈ సినిమాను క్యూబ్ లో ఫ్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి చూసారు. చూడడమే కాదు, వెంటనే గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసారు.ఒంగోలులో తాను చదువుకుంటున్న రోజుల్లో ఈ వేటపాలం గ్యాంగ్ లు, వారి విచిత్రమైన అలవాట్ల గురించి విన్నానని గుర్తుచేసుకున్నారు.
అలాగే ఒంగోలులో దీపాలు ఆర్పేసి, మర్డర్లు చేయడం అనే కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. ఇలా సినిమా గురించి మాట్లాడుతూ, ఒంగోలు జ్ఞాపకాలు తలుచుకున్నారట మెగాస్టార్. అంతే కాదు, ఆచార్య సెట్ కు గోపీచంద్ ను రమ్మని పిలిచారు.
మెగాస్టార్ ఫోన్ చేయడం, ఒంగోలు జ్ఞాపకాలతో ముచ్చటించడం, అంతేకాదు ఆచార్య సెట్ కు రమ్మని పిలవడంతో డైరక్టర్ గోపీచంద్ మలినేని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.