సాగర్ లో జానారెడ్డి భవిష్యత్ ని నిర్ణయించేది వాళ్లే..!

పీసీసీ చీఫ్ ఎన్నికల సందర్భంగా అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్ని వర్గాలున్నాయో, ఎవరెవరి మధ్య ఎన్ని విభేదాలున్నాయనే విషయం బయటపడింది. ఏ ఒక్కరికీ ఇంకో నాయకుడితో సయోధ్య లేదనే వాస్తవం అధిష్టానానికి కూడా…

పీసీసీ చీఫ్ ఎన్నికల సందర్భంగా అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్ని వర్గాలున్నాయో, ఎవరెవరి మధ్య ఎన్ని విభేదాలున్నాయనే విషయం బయటపడింది. ఏ ఒక్కరికీ ఇంకో నాయకుడితో సయోధ్య లేదనే వాస్తవం అధిష్టానానికి కూడా అర్థమైంది.

ఈ దశలో నాగార్జున సాగర్ ఎన్నికల కోసం అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పై పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే సాగర్ బరిలో జానారెడ్డి కోసం అందరూ కలిసొస్తారా అనేదే అనుమానం..?

2018 ఎన్నికల్లో కేవలం 4శాతం ఓట్లు తగ్గడంతో ఓడిపోయారు జానారెడ్డి. టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవానికి సాగర్ లో పార్టీ బలం కంటే.. జానా బలగమే ఎక్కువ. అందుకే ఆయన గెలుపు అంచుల వరకూ వెళ్లారు. ఈ దఫా టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత తనకి కలిసొస్తుందని ఆయనన అంచనా.

అదే సమయంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కూడా ఆయన లెక్కలో వేసుకున్నారు. బీజేపీని నిలువరించాలంటే.. ఆ పార్టీ ప్రచార వ్యూహాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. అంటే.. కాంగ్రెస్ తరపున కూడా ప్రచారం జోరందుకోవాలి, దానికి ముఖ్య నాయకులు కలసి రావాలి. 

ఆపద్ధర్మ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, పీసీసీ పీఠం కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి  వెంకట రెడ్డి జిల్లా కూడా అదే కావడంతో వారిద్దరూ కచ్చితంగా జానారెడ్డి కోసం తరలి వస్తారని అంచనాలున్నాయి. 

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో జానాకి అందరి సపోర్ట్ ఉంటుందని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారం కాస్త అనుమానమే. పీసీసీ పదవి హోల్డ్ లో పెట్టేసరికి రేవంత్ లీడ్ తీసుకుంటారా లేదా అనేది డౌట్.

అధిష్టానంలో చలనం వస్తుందా..?

తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పార్టీ, కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ. అయితే ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చూపిస్తోంది. తెలంగాణలోనే కాదు.. మిగతా చోట్ల కూడా అధిష్టానం పెద్దగా పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని కూడా రంగంలోకి దింపి బీజేపీ గ్రేటర్ పై పట్టు సాధించింది.

కేంద్రంలో అధికారంలోఉన్న బిజీ నేతలే గెలుపు కోసం అంత తాపత్రయ పడితే, ప్రతిపక్షంలో ఉన్నవారు ఇంకెంత కసిగా ఉండాలి. ఆ కసి లేకపోవడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ వైపు చూడలేదు. కనీసం సాగర్ ఉప ఎన్నిక విషయంలో అయినా హైకమాండ్ తరలి వస్తుందేమో చూడాలి. జానా రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి ప్రియాంక, రాహుల్ తో ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు.

కేంద్రం పెద్దలతో పాటు, రాష్ట్రంలోని కీలక నేతలంతా కలసి వస్తేనే సాగర్ లో కాంగ్రెస్ కు కాస్త కలిసొస్తుంది. లేకపోతే.. గెలిచే సత్తా ఉన్న సీటు కూడా టీఆర్ఎస్ కి లేదా బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తుంది. 

గెరిల్లా యుద్దమే చేయాలి