సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల ప్లాన్లు ఆలోచిస్తుంటారు. అందులో ఇంటర్వూల వ్యవహారం ఒకటి. అయితే పెద్ద పెద్ద డైరక్టర్లు హీరోలను, మరో డైరక్టర్ ను ఇంటర్వూ చేస్తే ఆ క్రేజ్ వేరుగా వుంటుంది. గతంలో క్రిష్ ను రాజమౌళి, అలాగే చంద్రశేఖర్ యేలేటిని రాజమౌళి ఇంటర్వూ చేసారు. ఇలా రకరకాల కాంబినేషన్ ఇంటర్వూలు కాస్త ప్రెస్టీజియస్ సినిమాలకు ప్లాన్ చేయడం కామన్.
లెటెస్ట్ గా మెగా మూవీ సైరా విడుదలయింది. సినిమాకు, అందులో మెగాస్టార్ నటనకు అన్నివైపుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే సినిమాకు ప్రమోషన్లు చేయాల్సి వుంది. అలా అని చెప్పి, మెగాస్టార్ రేంజ్ కు స్టూడియోలకు వెళ్లి ఇంటర్వూలు ఇవ్వడమో లేదా, విడివిడిగా ఇంటర్వూలు ఇస్తూ పోవడమో సాధ్యం అయ్యేదికాదు.
అందుకే ఓ ప్రత్యేక ఇంటర్వూ ప్లాన్ చేస్తున్నారు. టాప్ అండ్ ఇంటలెక్చ్యువల్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వూ చేయిస్తే ఎలా వుంటుంది అన్న అయిడియా ఒకటి వచ్చింది. ఇప్పుడు దాని మీద, దాని సాధ్యాసాధ్యాల మీద వర్కవుట్ చేస్తున్నారు.
ఇదిలావుంటే విడుదల రోజు సాయంత్రం తివిక్రమ్ శ్రీనివాస్ సైరా సినిమా చూసారు. ఆయన అభిప్రాయం ఏమిటన్నది నేరుగా బయటకు రాలేదు కానీ, విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఆయన జస్ట్ ఓకె మూవీ అని సన్నిహితుల దగ్గర కామెంట్ చేసారని తెలుస్తోంది.
అంత మాత్రం చేత ఇంటర్వూ చేయకపోవడం అన్నది వుండదు. సినిమాను అద్భుతం అని అనకుండా వుండరు. ఎందుకంటే సినిమా రంగం అంతా హిపోక్రసీ మీదే నడుస్తుంది కదా? పైగా త్రివిక్రమ్ భవిష్యత్ లో ఓ సినిమా చిరంజీవితో చేయబోతున్నారు. అదీకాక బహిరంగ సభల్లో పొగడ్తలు కురిపిస్తూ త్రివిక్రమ్ చేసే ప్రసంగాలు కూడా తెలిసినవే.