మిడ్ రేంజ్ సినిమాలు మటాషేనా?

దసరా ముందు నుంచి దీపావళి తరువాత వరకు సినిమాలు వస్తున్నాయి..వెళ్తున్నాయి. కానీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. తెలుగునాట థియేటర్లకు ఫ్యామిలీలు తరలి రావడం లేదు. Advertisement ఇదంతా కరోనా ప్రభావమా? ఓటిటి…

దసరా ముందు నుంచి దీపావళి తరువాత వరకు సినిమాలు వస్తున్నాయి..వెళ్తున్నాయి. కానీ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. తెలుగునాట థియేటర్లకు ఫ్యామిలీలు తరలి రావడం లేదు.

ఇదంతా కరోనా ప్రభావమా? ఓటిటి ప్రభావమా? అన్నది టాలీవుడ్ జనాలకు అంతు పట్టడం లేదు. ఫ్యామిలీలు రాకుండా సినిమాలకు కలెక్షన్లు కనిపించవు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తొలి వారం వరకు అనేక చిన్న, మీడియం సినిమాలు విడుదలకు డేట్ లు వేసుకుని వున్నాయి. వీటి పరిస్థితి ఎలా వుంటుందో అర్థం కావడం లేదు. బాగున్న సినిమా అయినా, బాగాలేని సినిమా అయినా, యావరేజ్ సినిమా అయితే ఒకలాగే వుంది వ్యవహారం. 

నార్త్ లో విడుదలయిన సూర్యవంశీకి మంచి వసూళ్లు వచ్చి వుండొచ్చు. డిసెంబర్ నుంచి విడుదలయ్యే పెద్ద సినిమాలకు వసూళ్లు బాగుండి వుండొచ్చు. కానీ టాలీవుడ్ లో తయారయ్యేవి మిడ్ రేంజ్ సినిమాలే ఎక్కువ. 

మన దగ్గర వున్నంత మంది మిడ్ రేంజ్ హీరోలు ఎక్కడా లేరు. కానీ కరోనా, ఓటిటి ఈ రెండూ కలిసి మిడ్ రేంజ్ సినిమాలను చంపేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇదే వాస్తవమైతే దాదాపు డజనుకు పైగా మిడ్ రేంజ్ హీరోలకు కష్టకాలం తప్పదు. ధైర్యం చేసి ఆంధ్రలో అయిదు నుంచి పది కోట్ల మార్కెట్ చేసే సినిమాలు కనిపించడం లేదు. 

టికెట్ రేట్ల సంగతి అలా వుంచితే జనాలు ఓటిటి కి అలవాటు గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది. ఇదే నిజమైతే ఇకపై ఇరవై కోట్లు, ముఫై కోట్ల సినిమాలకు కష్టకాలమే. నలభై యాభై కోట్ల సినిమాల సంగతి ఇక చెప్పనక్కరలేదు. 

త్వరలోనే ఈ తత్వం టాలీవుడ్ జనాలకు బోధపడేలా వుంది వ్యవహారం చూస్తుంటే.