మార్కెట్ లో ఓ చిత్రమైన వ్యవహారం వుంటుంది. తూకానికి అమ్మే సరుకులు, బరువు తక్కువ తూగేవి ఎక్కువ రేటు వుంటాయి. ఎక్కువ బరువు తూగేవి తక్కువ రేటు వుంటాయి.
అలాగే తక్కువ బరువు వుంటే పీస్ రేట్ అంటారు. ఎక్కువ బరువు వుంటే వెయిట్ లెక్కన రేటు అంటారు. ఇదంతా మార్కెట్ మాయాజాలం. ఇప్పుడు ఇలాంటి మాయాజాలమే సినిమా రంగంలోకి కూడా ప్రవేశించినట్లు కనిపిస్తోంది.
సినిమాకు పది కోట్లు తీసుకుని ఓ మిడ్ రేంజ్ హీరో సడెన్ గా ఓ సినిమాకు 15 కోట్లు కోట్ చేసారని తెలుస్తోంది. అదెందుకు. మార్కెట్ ఏమన్నా పెరిగిందా? వరుస హిట్ లు వున్నాయా? అంటే అంత సీనేం లేదు.
కానీ మరెందుకు అలా అంటే ఆ ప్రాజెక్టుకు ప్రొడక్షన్ ఖర్చు తక్కువ అంట. ప్రొడక్షన్ ఖర్చు తక్కువ అయితే నిర్మాత లాభపడాలి కదా?
అంతే కానీ ఆ లాభం తను లాగేసుకోవాలని అనుకుని రెమ్యూనిరేషన్ పెంచేయడం ఏమిటో? పాపం నిర్మాతలు ఏమంటారు. 10 నుంచి పదిహేను అంటే పన్నెండు దగ్గరో, పదమూడు దగ్గరో సెటిల్ చేసుకోవడం తప్ప.