మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశాఖలో వున్నారు. ఆచార్య షూటింగ్ ముగిసింది. లూసిఫర్ రీమేక్ మీదకు వెళ్లే ముందు డీ టాక్సినేషన్, బాడీ ఫిట్ నెస్ వంటి వ్యవహారాల మీద ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసం ఆయన విశాఖలోని ఓ ప్రముఖ ఆయుర్వేదిక్ స్పా రిసార్ట్ లో వున్నారని తెలుస్తోంది.
గతంలో కూడా ఇదే స్పాలో ఆయన వారం రోజులు గడిపారు. అప్పట్లో నిర్మాత దిల్ రాజు కూడా అక్కడే వున్నారు.
సాధారణంగా ఈ డీ టాక్సినేషన్ కోసం మన హీరోలు ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటారు. కానీ గతంలో ఒక సారి, ఇప్పుడు రెండోసారి మెగాస్టార్ విశాఖకే వెళ్లారు.
అక్కడి నుంచి వచ్చాక లూసిఫర్ వర్క్ ప్రారంభం అవుతుంది. మెగాస్టార్ తో పాటు సత్యదేవ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.
మలయాళంలో పృధ్వీరాజ్ చేసిన పాత్ర కోసం ఓ ప్రముఖ హీరోను సంప్రదిస్తున్నారు. అది ఓకె అయితే బయటకు ప్రకటిస్తారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.