సర్కారువారి పాట సినిమాకు సంబంధించి మహేష్ బాబు అభిమానుల ఫీలింగ్ ఇది. మరీ ముఖ్యంగా కొన్ని గంటల కిందట విడుదలైన వీడియో చూసిన తర్వాత ఈ ఫీలింగ్ రెట్టింపు అయింది. అవును.. సర్కారువారి పాట సినిమా కథ, కథనం లాంటి అంశాలతో సంబంధం లేకుండా.. మహేష్ బాబు లుక్, స్టయిల్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షించింది.
గడిచిన 2-3 సినిమాలుగా మహేష్ బాబు లుక్, స్టయిల్ లో ఎలాంటి కొత్తదనం కనిపించలేదు. భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లోనైతే మరీ బిగుసుకుపోయాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్స్ తో మేజిక్ చేశాడు తప్ప బాడీలాంగ్వేజ్ లో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇన్నాళ్లకు సర్కారువారి పాట సినిమాలో కంప్లీట్ మేకోవర్ చూపించాడు మహేష్.
బర్త్ డే బ్లాస్టర్ అంటూ రిలీజ్ చేసిన వీడియోలో సరికొత్త మహేష్ కళ్లముందు కనిపించాడు. హెయిర్ స్టయిల్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేశాడు. వీడియోలో కీర్తిసురేష్ కనిపించిన తర్వాత మహేష్ హావభావాలు, ఆ స్టయిల్ సింప్లీ సూపర్ అంతే.
దీంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాబు పండక్కి కన్నులపండగ తీసుకురాబోతున్నాడని ఫిక్స్ అయ్యారు. మరీ ముఖ్యంగా కథ, కథనం, సాంగ్స్ లాంటివి పక్కనపెట్టి.. మహేష్ బాబును అలా చూస్తూ ఉండిపోతామంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక వీడియో విషయానికొస్తే, బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ''బ్లాస్టర్'' అయినప్పటికీ.. కీర్తిసురేష్, వెన్నెల కిషోర్ కు కూడా చోటిచ్చారు. అలా సినిమాలో యాక్షన్ తో పాటు లవ్, కామెడీ కూడా ఉందనే విషయాన్ని స్పష్టంచేశారు. వీడియోకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.