Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మైండ్ బ్లాక్ ఐటమ్ సాంగ్ కాదట

మైండ్ బ్లాక్ ఐటమ్ సాంగ్ కాదట

సరిలేరు నీకెవ్వరు నుంచి 'మైండ్ బ్లాక్' సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ విన్నవారంతా, ఇది సినిమాలో అయిటమ్ సాంగ్ అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో తమన్నాతో అయిటమ్ సాంగ్ వుందని ముందే అందరికీ తెలిసిపోయింది కాబట్టి. కానీ అక్కడే తప్పులో కాలు పడింది. మైండ్ బ్లాక్ సాంగ్ తమన్నా ఐటమ్ సాంగ్ ఒకటి కాదు.

తమన్నా ఐటమ్ సాంగ్ వేరే వుంది. అది జనవరి 1న మహేష్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ కానుకగా వస్తుంది. ఇప్పుడు వదిలిన మైండ్ బ్లాక్ సాంగ్ ప్రీ క్లయిమాక్స్ లో వస్తుంది. తెలుగు సినిమాల్లో క్లయిమాక్స్ ముందు మాస్ సాంగ్ పెట్టడం అన్నది ఎవ్వరూ ఏ మాత్రం తప్పని ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం పెట్టిన సాంగ్ ఇది.

ఈ పాట రష్మిక-మహేష్ మీదే వుంటుంది. మహేష్ పూర్వం వచ్చిన హీరో కృష్ణ సినిమాల మాదిరిగా లుంగీ, లాల్చీ వేసి, కర్ర పట్టుకుని, చేతులకు మల్లెపూలు పట్టుకుని, పక్కా పల్లెటూరి మైనరు బాబు లుక్ లో కనిపిస్తాడు.

ఈ పాట ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే, ప్రస్తుతం మాంచి డిమాండ్ లో వున్నశేఖర్ మాస్టర్ తొలిసారి మహేష్ కు డ్యాన్స్ డైరక్షన్ చేయడం. అదీ అసలు విషయం అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?