మిస్టర్ మజ్ఞు.. వన్ మంత్ లవ్

''కొన్ని ప్రేమ కథలు చాలా సింపుల్ గా వుంటాయి''.. మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో చూపించిన ఓ క్యాప్షన్ ఇది. ఒక విధంగా తన సినిమా సబ్జెక్ట్ చాలా సింపుల్ అని ఈ విధంగా…

''కొన్ని ప్రేమ కథలు చాలా సింపుల్ గా వుంటాయి''.. మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో చూపించిన ఓ క్యాప్షన్ ఇది. ఒక విధంగా తన సినిమా సబ్జెక్ట్ చాలా సింపుల్ అని ఈ విధంగా దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పకనే చెప్పాడేమో? ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ మాదిరిగా, పెళ్లికి దారి తీసే ప్రేమకు దూరంగా వుండే కుర్రాడి కథ మిస్టర్ మజ్ఞు అని ట్రయిలర్ చెబుతోంది.

వెంకీ అట్లూరి మంచి సంభాషణలు రాసుకుంటాడు. వాటి ద్వారా సన్నివేశాలకు బలం తీసుకురావడం అతని స్పెషాలిటీ. ' నా కోసం ఎంత మంది ఏడ్చినా నా తప్పు అని అనుకోను కానీ, నా వల్ల ఒక్కరు ఏడ్చినా అది ముమ్మాటికీ నా తప్పే' అన్న డైలాగు కానీ, 'కాస్సేపు ప్రేమించి, ఆ తరువాత ఇణకా ఎక్కువ ప్రేమించి, ఆపై మరింత ప్రేమించి, పెళ్లి చేసుకునే టైపు లవ్వా? చచ్చాంపో.. అది అయితే అస్సలు చాతకాదు' అనే డైలాగు కానీ సినిమాలో సబ్జెక్ట్ సింపుల్ కానీ, విషయం కాదన్న సంగతి చెబుతున్నాయి.

అయితే మిస్టర్ మజ్ఞు టీజర్ కట్ చేసినంత అట్రాక్టివ్ గా ట్రయిలర్ కట్ చేయడంలో డైరక్టర్ వెంకీ అట్లూరి ప్రతిభ అంతగా కనిపించలేదు. ట్రయిలర్ లో ఏదో చిన్న వెలితి. సోల్ మిస్సయిన ఫీలింగ్ వుంది.బహుశా సింపుల్ కథ అయినా అసలు లాక్ బయటపెట్టడం ఇబ్బందిగా వుండడంతో ట్రయిలర్ ను ఇలా అన్ని రుచులు కలిపి కట్ చేసినట్లు కనిపిస్తోంది.