మోహన్ బాబు ..రౌడీ సెంటిమెంట్

అన్నీ పేర్లు పోయి..ఆఖరికి రౌడీ అన్న పేరు ఫిక్సయింది, రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు కాంబినేషన్ సినిమాకు. సర్కార్ అడుగుజాడల్లో, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తయారవుతున్న సినిమా. రౌడీ పేరు మోహన్ బాబుకు…

అన్నీ పేర్లు పోయి..ఆఖరికి రౌడీ అన్న పేరు ఫిక్సయింది, రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు కాంబినేషన్ సినిమాకు. సర్కార్ అడుగుజాడల్లో, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తయారవుతున్న సినిమా. రౌడీ పేరు మోహన్ బాబుకు బాగా అచ్చివచ్చింది. గతంలో అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం (రాఘవేంద్రరావు సోదరుడు ప్రకాష్ దర్శకుడు) వంటి సినిమాలు పెద్ద హిట్ లు. బహుశా అందుకే ఈ పేరు ఎంచుకుని వుంటాడు. లేకుంటే రాయలసీమ ఫ్యాక్షన్ కు రౌడీ పేరుకు సంబంధం ఏమిటి? పైగా రామ్ కు కూడా ఈ పేరుపై మక్కువ వుండిపోయింది. బెజవాడ రౌడీలు అని పేరు పెట్టి, ఆఖరికి తీసేసి, బెజవాడ అని వుంచాల్సి వచ్చింది. ఇప్పుడు అతగాడి మోజు కూడా తీరిపోతుంది. 

మోహన్ బాబు స్టామినా ఏమీ తగ్గలేదని పా.పా.తు నిరూపించింది. అందులో పిల్లల కన్నా ఆయనకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మంచు ఫ్యామిలీ కూడా ఈ విషయం గుర్తించినట్లుంది. టీవీల్లో రేడియోల్లో ఆయన పేరు, క్లిప్పింగ్స్ నే వాడుకుంటోంది. పైగా మోహన్ బాబు నెగిటివ్ షేడ్ వున్న రోల్స్ బాగా చేస్తాడు. రామ్ కాస్త కాన్సన్ ట్రేట్ చేసి తీస్తే, రౌడీ జనాలకు నచ్చేయచ్చు.