బాహుబలి తరువాత రాజమౌళి అందిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. భారీ సినిమా, భారీ తారాగణం వున్న సినిమా కావడంతో విడుదల తేదీలు మారుతూనే వున్నాయి.
పైగా కరోనా టోటల్ గా ఈ సినిమాతో ఓ లెక్కలో ఆడేసుకుంటోంది. 2021 దసరాకు రావాల్సిన సినిమా. కరోనా రెండో దశలో చిక్కుకుపోయింది. ఇక రాబోయేది 2022 సమ్మర్ కే అని ఎప్పుడో వార్తలు వచ్చేసాయి.
నిజానికి జూలై నుంచి షూటింగ్ లు మొదలైతే 2022 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అలా చేయకుండా 2022 సమ్మర్ కే ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.
సంక్రాంతి కి వెయిట్ చేస్తే మూడోదశ ఏమైనా వస్తే, మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందని అందుకే ఏకంగా సమ్మర్ కే ప్రిపేర్ కావడం మంచిదని రాజమౌళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
కరోనా రెండో దశ విషయంలో పరిశొధకుల మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. అందువల్ల మూడో దశ విషయంలో కూడా వారి మాట కొట్టి పారేయలేమని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే చాలా సినిమాల నెత్తిన పాలు పోసినట్లే. రాథేశ్వామ్, సర్కారువారిపాట, అయ్యప్పన్ రీమేక్, ఆచార్య, లాంటి సినిమాలు 2022 సంక్రాంతి మీద దృష్టి పెట్టుకునే అవకాశం దొరుకుతుంది.