cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అన‌న్య విచార‌ణ‌తో.. మ‌రెవ‌రికి నోటీసులో!

అన‌న్య విచార‌ణ‌తో.. మ‌రెవ‌రికి నోటీసులో!

బాలీవుడ్ సెల‌బ్రిటీలు.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఒక‌రు దొరికితే.. వారి స‌న్నిహితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న‌ట్టుగా ఉన్నాయి. ఆర్య‌న్ ఖాన్ దొరికిన త‌ర్వాత‌.. అత‌డి ఫోన్ ను ఎన్సీబీ స్వాధీనం చేసుకోవ‌డంతో.. అన‌న్య‌పాండే విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్టుగా ఉంది. 

వాస్త‌వానికి ఆర్య‌న్ ఖాన్ వ‌ద్ద వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి డ్ర‌గ్స్ దొర‌క‌లేద‌ని ఎన్సీబీ అధికారులే పేర్కొన్నారు. అత‌డి ప‌క్క‌నున్న వారి వ‌ద్ద డ్ర‌గ్స్ ఉండ‌టం, వారు అత‌డికి స్నేహితులు కావ‌డంతో.. ఆర్య‌న్ ను అరెస్టు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ బెయిల్ ద‌క్క‌లేదు.

అయితే ఆర్య‌న్ ఖాన్ ను ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకోవ‌డంతోనే క‌థలో మ‌లుపు చోటు చేసుకుంది. ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ గురించి వాట్సాప్ లో చాట్ చేశాడ‌ని ఎన్సీబీ అధికారులు కోర్టుకు చెప్ప‌డం, అత‌డు ఒక బాలీవుడ్ న‌టీమ‌ణితో కూడా డ్ర‌గ్స్ గురించి చాట్ చేశాడ‌ని మొద‌ట మీడియాకు లీకు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత కోర్టుకు చెప్ప‌డం, చివ‌ర‌కు ఆ హీరోయిన్ అన‌న్య‌గా తేల‌డం జ‌రిగింది. ఇప్పటికే ఒక సారి అన‌న్య పాండే ఎన్సీబీ విచార‌ణ‌కు హాజ‌రైంది.

ఆ త‌ర్వాత ఆమెను సోమ‌వారం మ‌రోసారి విచార‌ణ‌కు రావాల్సి ఉంటుంద‌ని చెప్పార‌ట‌. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడ‌ప్పుడే ఆగే అవ‌కాశాలు అయితే క‌న‌ప‌డ‌టం లేదు. ఆర్య‌న్ కు అన‌న్య డ్ర‌గ్స్ అరేంజ్ చేసింద‌నే అభియోగాలు న‌మోద‌య్యేలా ఉన్న‌ట్టున్నాయి.  

మూడు సార్లు అన‌న్య అత‌డికి డ్ర‌గ్స్ ఏర్పాటు చేసింద‌నేది ఎన్సీబీ ఇచ్చిన లీక్. మ‌రి ఇందుకు సంబంధించి ఆధారాలు వాట్సాప్ చాట్ లే. అయితే త‌ను ఆర్య‌న్ తో డ్ర‌గ్స్ గురించి జోక్ చేసిన‌ట్టుగా అన‌న్య చెప్పింద‌ట‌. మ‌రి అది జోక్ మాత్ర‌మేనా.. ఈ వ్య‌వ‌హారంలో అన‌న్య అరెస్టు కూడా జ‌రుగుతుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వ్య‌వ‌హారం అన‌న్య అరెస్టు వ‌ర‌కూ వ‌స్తే.. అది ఇంకా ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది, ఇంకా బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో ఎవ‌రెవ‌రు ఎన్సీబీ విచార‌ణ‌ల‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌గా మారింది. ఎక్క‌డో తీగ లాగితే మ‌రెక్క‌డో డొంక క‌దిలిన‌ట్టుగా ఉంది ఈ వ్య‌వ‌హారం!

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!