ఎమ్ ఎస్ ఆత్మ ఘోషిస్తుంది

ఎమ్ ఎస్ నారాయణ..మనం కోల్పోయిన మంచి కమెడియన్లలో ఒకరు. పండగచేస్కో ఆయన ఆఖరు సినిమా అనుకోవాలి బహుశా…ఈ సినిమాలో ఆయన చేత చెప్పిన కామెడీ డైలాగులను విని ఏ లోకంలోనో వున్న ఆయన ఆత్మ…

ఎమ్ ఎస్ నారాయణ..మనం కోల్పోయిన మంచి కమెడియన్లలో ఒకరు. పండగచేస్కో ఆయన ఆఖరు సినిమా అనుకోవాలి బహుశా…ఈ సినిమాలో ఆయన చేత చెప్పిన కామెడీ డైలాగులను విని ఏ లోకంలోనో వున్న ఆయన ఆత్మ ఘోషిస్తుంది అనుకోవాలి. బూతు డైలాగులు అని మారుతి లాంటి వారిని ఆడిపోసుకున్నారు..ఆయన ఇప్పుడు మారిపోయాడు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ లకు పనికి వచ్చే మాటలు రాస్తారనుకున్నా కోనవెంకట్ అండ్ కో ఇప్పుడు బూతు బాట పట్టారు. 

రామ్ హిట్ ల కోసం అర్రులు చాచిన హీరో, గోపీచంద్ మలినేని లాంటి డైరక్టర్లు, ఎలాగైనా హిట్ కొడితే చాలు అది దేనివల్లనైనా అని కోన వెంకట్ కు వ్యవహారాలు వదిలసినట్లు కనిపిస్తోంది. దాంతో ఆయన వావి వరసలు కూడా మరిచి, తండ్రీ కూతుళ్ల నడుమ చెత్త డైలాగులు చొప్పించారు..ఈ డైలాగులు చదివితే అర్థమవుతుంది 
అవి…ఎంత రోతగా వున్నాయో?

'నా కూతుర్ని ఓ రౌండ్ వేసుకో..'..
' మా ఆవిడ బ్యాక్ చూడు..',
 'మా ఆవిడ బయటుంది' 
'.,మా ఆవిడ పాతికేళ్లుగా బయటుంది'.
.'నేను ఎప్పుడో పెద్దమనిషి అయ్యాను'
 ' నా కూతరు క్యారెమ్స్ కాయిన్ లాంటిది..ఎవరు వేసినా పడిపోతుంది'.

హతవిధీ ఇవీ పండగ చేస్కోలాంటి ఫ్యామిలీ సినిమా అని డప్పేసుకున్న దాంట్లో డైలాగులు. 

ఎమ్ఎస్ తాగుబోతు కామెడీ చేసారు. కానీ ఎన్నడూ బూతు కామెడీ చేయలేదు. ఆయన చివరి సినిమాలో అది కూడా చేయించేసారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా దీనికి ఘోషించకమానదేమో?

అవును..అన్నట్లు ఇప్పుడు కోన వెంకట్ అండ్ కో ఇటు రామ్ చరణ్ సినిమాకు, అటు బాలయ్య బాబు సినిమాకు కూడా పనిచేస్తున్నారు. అక్కడ కూడా విజయాలు చాలా అవసరం. మరి అక్కడా ఇలాగే బూతులు దట్టిస్తారా..

సమస్యే లేదు..బాలయ్య, చిరంజీవి ఇలాంటి వాటిని కిలోమీటర్ల దూరంలో వుంచుతారు. రామ్ కు అంటే ఈ సినిమా హిట్ కాకుంటే గత్యతరం లేదు కాబట్టి, కోనం వెంకట్ అండ్ కో చెప్పిన దానికి తలూపి వుంటాడు.