ముహుర్తం చూస్తున్న మహేష్

దర్శకుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్లానింగ్ లో వున్న సినిమా అనౌన్స్ మెంట్ కు వేళ అవుతోంది. మూఢం వెళ్లిపోయాక ఏ రోజయినా ప్రకటించాలని నిర్మాణ సంస్థ హారిక హాసిని…

దర్శకుడు త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్లానింగ్ లో వున్న సినిమా అనౌన్స్ మెంట్ కు వేళ అవుతోంది. మూఢం వెళ్లిపోయాక ఏ రోజయినా ప్రకటించాలని నిర్మాణ సంస్థ హారిక హాసిని ఇన్నాళ్లు ఆగింది. ఇక ప్రకటించడానికి పర్మిషన్ కావాలని నమ్రత ద్వారా హీరోను రిక్వెస్ట్ చేసారు.అయితే అటు నుంచి సమాధానం పెండింగ్ లో వుంది.

మహేష్ కు కూడా ముహుర్తాలు, నమ్మకాలు వున్నాయి. ఆయన మరి ఈ రోజు ప్రకటించమంటారో లేదా తండ్రి కృష్ణ బర్త్ డే వరకు ఆగమంటారో తెలియాల్సి వుంది. నిజానికి ఇప్పటికిప్పుడు ప్రకటించి చేసేది ఏమీ లేదు. సర్కారువారి పాట షూటింగ్ పూర్తి కావాల్సి వుంది.

అలాగే ప్రకటించినంత మాత్రాన ప్రాజెక్టు వుంటుందన్న గ్యారంటీ కూడా ఇటీవల టాలీవుడ్ లో లేకుండా పోయింది వంశీపైడిపల్లి-మహేష్ సినిమా వుంటుంది అనుకున్నారు. ఆగిపోయింది. 

సుకుమార్-మహేష్ సినిమా అనుకున్నారు ఆగిపోయింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రకటించి మరీ ఆగిపోయింది. బన్నీ-వేణు శ్రీరామ్, బన్నీ-లింగుస్వామి సినిమాలు పరిస్థితి అంతే.

అందువల్ల సినిమాకు ఎప్పుడు క్లాప్ పడితే ఫ్యాన్స్ కు అప్పుడే పండగ.