మొత్తానికి మెగా ఫ్యామిలీలో వచ్చిన విడుదల తేదీల సమస్య సమసిపోయినట్లే. పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, వరుణ్ తేజ ముకుంద సినిమా సినిమాలు రెండూ సంక్రాంతికే విడుదల అవుతాయంటూ ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో కాస్త అయోమయం నెలకొంది అభిమానుల్లో.
ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరి నటుల సినిమాలు ఒకేసారి విడుదల కావడం అంటే అంత మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ గోపాల గోపాల నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ ఎలాగైనా పండుగకే విడుదల చేస్తామని పట్టుదల పట్టడంతో ఎందుకు వచ్చిన సమస్య అని, ముకుంద నిర్మాతలు తమ సినిమాను అంతకన్నా ముందే విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారు.
డిసెంబర్ మొదటి వారంలో అడియో ఫంక్షన్ ను, ఆఖరి వారంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. దాంతో ఇక గోపాల గోపాల సంక్రాంతికి విడుదల కావడం ఖాయమైంది.