ముప్పయ్‌ కోట్లు.. తగ్గేదే లేదు

శంకర్‌ సినిమా ‘ఐ’ మీద ఎన్ని అంచనాలున్నాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శంకర్‌ ఏదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడని అంతా ప్రగాఢంగా నమ్ముతున్నారు. వెర్సటాలిటీకి పెట్టింది పేరయిన విక్రమ్‌ ఈ చిత్రంలోని పాత్ర కోసం తన శరీరాన్ని…

శంకర్‌ సినిమా ‘ఐ’ మీద ఎన్ని అంచనాలున్నాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శంకర్‌ ఏదో అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాడని అంతా ప్రగాఢంగా నమ్ముతున్నారు. వెర్సటాలిటీకి పెట్టింది పేరయిన విక్రమ్‌ ఈ చిత్రంలోని పాత్ర కోసం తన శరీరాన్ని వివిధ రకాలుగా మలచుకున్నాడు. తెలుగులో మనోహరుడు పేరుతో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఇంకా ఇక్కడ బిజినెస్‌ జరగలేదు. 

తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ని ముప్పయ్‌ కోట్లకి అమ్మాలని చూస్తున్నారు. అంత మొత్తం చెల్లించడానికి మన నిర్మాతలు వెనుకాడుతున్నారు. శంకర్‌ తీసిన రోబో నలభై కోట్ల షేర్‌ రాబట్టినా కానీ దానికి రజనీకాంత్‌ ఫ్యాక్టర్‌ కూడా దోహదపడిరది. విక్రమ్‌కి తెలుగులో ముప్పయ్‌ కోట్ల మార్కెట్‌ లేదు. ఈ చిత్రం పాటలు విడుదలై, ట్రెయిలర్లు బయటకి వస్తే తప్ప మన వాళ్లు ఒక అంచనాకి రాలేరు. 

భారీ వ్యయంతో రూపొందిన చిత్రం కావడంతో ఐ నిర్మాతలు కాంప్రమైజ్‌ కావడం లేదు. ఒకవేళ బయ్యర్స్‌ రాకపోయినట్టయితే వాళ్లే స్వయంగా విడుదల చేసుకోవాలని కూడా చూస్తున్నారు. తెలుగు సినిమా మార్కెట్‌ రోబో టైమ్‌కి, ఇప్పటికీ చాలా పెరిగింది కనుక ముప్పయ్‌ కోట్లు కోట్‌ చేయడం రీజనబుల్‌ అనేది వారి ఫీలింగ్‌.