రభస చిత్రం వసూళ్లు నానాటికీ క్షీణిస్తున్నాయి. అయిదో రోజునే ఈ చిత్రం ఏపీ/తెలంగాణ షేర్ కోటి రూపాయల కంటే దిగువకి పడిపోయింది. తొలి వారంలో వరల్డ్ వైడ్ షేర్ పాతిక కోట్ల వరకు వస్తుందని అంచనా. అదృష్టవశాత్తూ పవర్ వాయిదా పడడంతో రభసకి మరో వారం స్పేస్ దొరికింది.
కానీ ఈ స్పేస్‌ని యుటిలైజ్ చేసుకునే అవకాశాలు కూడా తక్కువే కనిపిస్తున్నాయి. శని, ఆదివారాల్లో బెటర్ షేర్లు రాబట్టినా కానీ మళ్లీ వర్కింగ్ డేస్‌లో ఇబ్బందులు తప్పవు. రెండవ వారంలో పోటీ లేకపోవడం వల్ల ఈ చిత్రం ముప్పయ్ కోట్ల మార్కు దాటగలుగుతుందని, దాదాపుగా రామయ్యా వస్తావయ్యా రేంజ్‌లోనే ముగుస్తుందని ట్రేడ్ టాక్.
ఎన్టీఆర్‌కి ఇంతవరకు నలభై కోట్ల క్లబ్‌లో కేవలం బాద్‌షా మాత్రమే ఉంది. రభస ఆ రేంజ్ సినిమా అవుతుందని అంచనా వేస్తే కనీసం దాని దరిదాపులకి కూడా చేరుకోలేకపోతోంది. రామయ్యా వస్తావయ్యా, రభస ఫెయిల్యూర్స్‌తో ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై ప్రెజర్ పెరిగింది. ఫామ్‌లో లేని పూరి జగన్నాథ్ ఆ చిత్రాన్ని ఎంతవరకు గట్టెక్కిస్తాడో మరి.