బాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆధిపత్య పోరు గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఒక హీరోయిన్ అంటే ఇంకో హీరోయిన్‌కి పడదు. ‘నా అవకాశాల్ని ఆ హీరోయిన్ లాగేసుకుంది..’ అంటూ గుస్సా అవడం చాలామంది హీరోయిన్లకు అలవాటు. ఫలానా హీరోతో రాసుకుపూసుకు తిరుగుతోందంటూ కొందరు హీరోయిన్లు తమ ప్రత్యర్థి హీరోయిన్లపై గాసిప్స్ పుట్టిస్తుంటారు కూడా. అందరూ కాదుగానీ, కొందరు హీరోయిన్లు ‘ఆరోగ్యకరమైన పోటీ’ అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తారు.
ఇక, అసలు విషయానికొస్తే బాలీవుడ్ భామ దీపికా పడుకొనే ‘మై ఛాయిస్’ పేరుతో ఓ షార్ట్ ఫిలింలో నటించింది. ఇందులో, స్త్రీ సాధికారిత గురించి ఓ స్టేట్‌మెంట్ కూడా దంచేసింది. అయితే ఈ వీడియో ద్వారా వ్యక్తం కాబడిన విషయాలపై సోనాక్షి సిన్హా, కంగనా రనౌత్ తదితర తారలు పెదవి విరిచేశారు. ‘స్త్రీ సాధికారత అంటే సెక్సీగా కనిపించడమొక్కటే కాదు..’ అని కంగనా రనౌత్ ఘాటైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. సోనాక్షి సిన్హా అయితే, ‘మై ఛాయిస్’లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు చెత్తగా వున్నాయనేసింది.
మరికొందరు మాత్రం దీపికని ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు. ‘అందులో తప్పేముంది.. దాంట్లో తప్పు పట్టడానికి వీళ్ళకు ఏం అభ్యంతకరమైన సన్నివేశాలు కనిపించాయో..’ అంటూ సోనాక్షి, కంగనా రనౌత్‌పై గుస్సా అయ్యారు. మొన్నామధ్య తెలుగులో ‘వినాయకుడు’ ఫేం సోనియా కూడా ఇదే టైపు షార్ట్ ఫిలిం చేసింది. అందులో సానియా చాలానే చేసింది. నెట్‌లో అభ్యంతకర వీడియోలు చూస్తున్నట్లూ కన్పించింది. ఆ వీడియోపైనే అనేక విమర్శలొచ్చాయి.
మహిళ, పురుషుడితో సమానమే. అలాగని చెయ్యకూడని పనులు కూడా పురుషులతో మేమూ సమానంగా చెయ్యగలం.? అనడం ఎంతవరకు సబబు.? మహిళ అయినా పురుషుడైనా తప్పుడు ఆలోచనలు చేస్తే తప్పు పట్టాల్సిందే.. అన్నది చాలామంది అభిప్రాయం.