Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ సినిమాలో మళ్లీ అనుష్క

నాగ్ సినిమాలో మళ్లీ అనుష్క

కింగ్ నాగార్జున..సీనియర్ హీరోయిన్ అనుష్కల సినిమాబంధం గురించి తెలియంది కాదు. నాగ్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. అవకాశం వున్నపుడల్లా నాగ్ సినిమాల్లో కనిపిస్తూనే వుంది అనుష్క. ఇటీవలే ఊపిరి సినిమాలో మెరుపులా మెరిసింది. ఇప్పుడు మరోసారి నాగ్ సినిమాలో కనిపించబోతోదంట. 

రాఘవేంద్రరావు-నాగ్ కాంబినేషన్ లో తయారవుతున్న నమో వెంకటేశాయ చిత్రంలో అనుష్క ఓ మంచి పాత్ర పోషించబోతోందట. వెంకటేశ్వరుని భక్తురాలి పాత్రలో అనుష్క కనిపిస్తుందట. అనుష్క అంటే నాగ్ కే కాదు, రాఘవేంద్రునికి మంచి అభిమానం వుంది. 

రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ డైరక్షన్ లో ఇటీవలే అనుష్క సైజ్ జీరో సినిమా చేసింది. అలాగే రాఘవేంద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన బాహుబలి సినిమాలో అనుష్కదే కీలకపాత్ర. ఇప్పుడు మళ్లీ మరోసారి అనుష్క నాగ్-రాఘవేంద్రరావులతో కలిసి సినిమా చేస్తోందన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?