నాగ్ కు డైరక్టర్లు కావాలి?

నాగార్జున డైరక్టర్ల కోసం వెదుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ డైరక్టర్లను అందరినీ తనతో సినిమా చేయమని అడుగుతున్నారని వినికిడి. కానీ అలా వచ్చిన యంగ్ డైరక్టర్లు అంతా నాగ చైతన్య సినిమా అడుగుతున్నారట.  దీంతో…

నాగార్జున డైరక్టర్ల కోసం వెదుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. యంగ్ డైరక్టర్లను అందరినీ తనతో సినిమా చేయమని అడుగుతున్నారని వినికిడి. కానీ అలా వచ్చిన యంగ్ డైరక్టర్లు అంతా నాగ చైతన్య సినిమా అడుగుతున్నారట.  దీంతో సరైన సినిమాలు ఏవి చేద్దామా అన్న డైలామాలో వున్నాడట. ఆఖరికి మెగాస్టార్ పరిచయం చేసిన కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు సెట్ అయ్యాడు. 

మళ్లీ ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు పైప్ లైన్ లో పెడదామంటే మాత్రం సరైన కథ, డైరక్టర్ సెట్ కావడం లేదట. పైగా మనం లాంటి సినిమా హిట్ అయిన నేపథ్యంలో, భాయ్, గ్రీకువీరుడు లాంటి ఫ్లాప్ సినిమాలు చూసిన తరువాత ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక కిందా మీదా అవుతున్నాడు నాగ్ అని టాలీవుడ్ వర్గాల సమాచారం.