నాగబాబు సహనం కోల్పోయిన వేళ..

మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవ వేడుకల్లో, ఆయన సోదరుడు నాగబాబు కాస్త ఇరిటేట్ అయ్యారు. మరి కాస్త సహనం కోల్పోయారు. సోషల్ నెట్ వర్క్ లో చలామణీ అవుతున్న యూట్యూబ్ విడియో ఈ…

మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవ వేడుకల్లో, ఆయన సోదరుడు నాగబాబు కాస్త ఇరిటేట్ అయ్యారు. మరి కాస్త సహనం కోల్పోయారు. సోషల్ నెట్ వర్క్ లో చలామణీ అవుతున్న యూట్యూబ్ విడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

మెగా ఫ్యామిలీలో ఎవరి ఫంక్షన్ జరిగినా పవన్ ఫ్యాన్స్ గడబిడ చేయడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లలో. అయినా చిరంజీవి, బన్నీ, చరణ్, అందరూ కాస్త ఓపిగ్గా భరిస్తూ వస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తూ, ప్రసంగాలకు ఆటంకం కలిగిస్తున్నా, భరిస్తున్నారు.

' మెగాస్టార్ ఫ్యామిలీకి చెందినవారు, ఆ సమావేశాలకు హాజరయిన వారు ఈ ఫ్యాన్స్ స్లోగన్స్ కారణంగా ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు…అయినా చిరునవ్వులు చిందిస్తూనే వుంటారు…ఆయన రాకపోతే వీళ్లేం చేస్తారు..వీళ్లు అర్థం చేసుకోరు' అన్నాడు..మెగా కుటుంబానికి దగ్గరగా వుంటే ఓ వ్యక్తి. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది మెగాస్టార్ బర్త్ డే ఫంక్షన్ లో.

దాంతో చిరంజీవి సోదరుడు నాగబాబు కాస్త సహనం కోల్పోయారు. '..ఆయన రాకపోతే మేమేం చేస్తాం..మేం రమ్మనమని ఎన్ని సార్లు పిలుస్తామో మీకు తెలుసా….ఎన్నిసార్లు పిలుస్తామో మీకు తెలుసా..తెలుసా..అయినా వాడు రాడు..ఇక్కడ గోల చేయడం కాదు..దమ్ముంటెే.. ఆయననే అడగండి..రమ్మని పిలుచుకురండి..' అనేలా మాట్లాడారు.

నిజానికి ఫ్యాన్స్ మీట్ కు రమ్మని పవన్ ను ఆహ్వానించారు. కానీ ఆయన రానని ముందే చెప్పేసారు. ఇప్పుడు ఈ నాగబాబు మాటల విడియో నెట్ లో చలామణీ అవుతోంది. దీన్ని చలామణీ చేస్తున్నావారంతా కామెంట్ చేసేది ఒక్కటే. ఇన్నాళ్లు పవన్, నాగబాబు ఒక్కటన్నారు..ఇప్పుడు ఇలా రివర్స్ అయ్యారేమిటి? అనే.

నిజానికి ఫ్యాన్స్ తో ఇలా చిరంజీవి కూడా మాట్లాడలేరు ఒక్క నాగబాబు మాత్రమే ఫ్యాన్స్ ను అభిమానిస్తారు..అదలించగలరు. ఇలా మాట్లాడినా, మళ్లీ అభిమానులు ఏ అవసరం వచ్చినా నాగబాబు దగ్గరకు వెళ్లాల్సిందే. అందకే వారు ఏమీ అనుకోరు. కానీ తన వైఖరి గురించి పవన్ ఆలోచించుకోవాలి. ఈ తరహా ప్రవర్తన, స్లోగన్ లు మానమని అభిమానులకు చెప్పాలి.