Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నగ్మా ప్రశ్నలో లాజిక్ వుందిగా?

నగ్మా ప్రశ్నలో లాజిక్ వుందిగా?

మనదేశం రాజ్యాంగం, పోలీస్, న్యాయ వ్యవస్థలో వ్యవహారాలు అంత సులువుగా అంతు పట్టేవి కావు. కామన్ మాన్ కు అర్థం అయ్యేవి కాదు. సవాలక్ష క్లాజులు, సబ్ క్లాజులు, లిటిగేషన్లు వుంటాయి.

అవసరం అయిన వాళ్లు, లేదా చేతనైన వాళ్లు, కాదూ అంటే పలుకుబడి వున్నవాళ్లు వాటి మధ్యనుంచి ఇసుకలా జారిపోవచ్చు. చాతకాని వాళ్లు, లేదా చేసుకోలేని వాళ్లు, ఇంకా కాదూ అంటే పలుకుబడి లేని వాళ్లు వాటిల్లో చిక్కుకుని గిలగిల లాడాల్సిందే.

బాలీవుడ్ లో మాదకద్రవ్యాల వ్యవహారం బయట నుంచి చూస్తున్నవాళ్లకు ఇలాగే కనిపిస్తోంది. ఎవరో చెప్పారని, లేదా ఎక్కడో వాట్సాప్ చాటింగ్, అది కూడా కోడ్ నేమ్స్ తో బయటపడిందని, పలువురు సెలబ్రిటీలకు సమన్లు ఇచ్చారు. విచారిస్తారు.

నిజానికి ఇంతకన్నా హడావుడి మన టాలీవుడ్ లోనే జరిగింది. బోలెడు మందిని పిలిచారు. విచారించారు. పరీక్షలు జరిపారు. ఇంకేవుంది. చాలా మంది బుక్ అయిపోయినట్లే అనుకున్నారు. కానీ ఇఫ్పటికీ ఏమీ జరగలేదు. ఏ హడావుడి లేదు. చార్జిషీట్ నే వేయలేదని ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. 

సరే ఆసంగతి పక్కన పెడితే ఒకప్పటి హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ఓ ప్రశ్నవేసారు. ఎవరో చెప్పారని, వాట్సాప్ చాటింగ్ వుందని పలువురికి నోటీసులు ఇచ్చి పిలిపించారు కదా, స్వయంగా తాను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పిన కంగనా రనౌత్ కు ఎందుకు నోటీస్ లు ఇవ్వలేదు, ఎందుకు పిలిపించలేదు అన్నది నగ్మా ప్రశ్న. నిజమే కదా. 

ఎవరో, ఎవరికోకావాలంటూ, వేరేవెరెవరికో మెసేజ్ పెడితే వాటి నిగ్గు తేల్చడానికి రెడీ కావడం ఓకె అనుకుంటే, మరి తాను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పినపుడు, అవి ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకోవడానికైనా కంగన కు కూడా నోటీస్ ఇవ్వాలి కదా?

ఇదిగో, సరిగ్గా ఇలాంటపుడే చట్టం అందరికీ సమానమేనా? కొందరికి తక్కువ సమానం, మరి కొందరికి ఎక్కువ సమానమా అన్న అనుమానాలు కామన్ మాన్ కు వస్తాయి.

టీడీపీ నీచరాజకీయాలు చేస్తోంది

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?