హీరో నాని 28వ సినిమా ప్రకటన రాబోతోంది. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రీ మూవీస్ నే ఈ సినిమాను నిర్మించబోతోంది.
వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతానికి జస్ట్ సినిమా ప్రకటన చేసి, రేపు మిగిలిన వివరాలు ప్రకటిస్తారు. 99శాతం ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసే అవకాశం వుంది.
ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నారు. అది పూర్తి చేసిన తరువాత శ్యామ్ సింగ రాయ్ ఫినిష్ చేయాల్సి వుంది. ఆ తరువాత మైత్రీ మూవీస్ సినిమాకు వస్తారు.
గ్యాంగ్ లీడర్ సినిమా మైత్రీకి ఆర్థికంగా గట్టి దెబ్బ తీసింది. అందువల్ల మళ్లీ మరో సినిమా చేస్తానని నాని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఈ సినిమా ప్రకటిస్తున్నట్లున్నారు. బ్రోచోవారేవరురా సినిమా తరువాత వివేక్ ఆత్రేయ చేయబోయే సినిమా ఇదే.