నాని 27 వ మూవీ అనౌన్స్ మెంట్ ఈ రోజు రాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత. టాక్సీవాలా చేసిన ఏడాదిన్నర తరువాత సినిమా దొరికింది డైరక్టర్ రాహుల్ కు. చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లినా వర్కవుట్ కాలేదు. రామ్ కు కథ చెప్పాడు వర్కవుట్ కాలేదు. ఆఖరికి నాని దగ్గర సెట్ అయింది.
విభిన్నమైన సబ్జెక్ట్ తో టేకప్ చేస్తున్న ఈ సినిమాకు చిత్రమైన టైటిల్ వినిపిస్తోంది. అమర్ అక్బర్ ఆంథోని మాదిరిగా శ్యామ్ సింఘ రాయ్ అనే టైటిల్ పెడుతున్నట్లు వినిపిస్తోంది. నోరు తిరగడానికి కాస్త చిత్రంగా వున్నా, అలా అలా జనంలోకి వెళ్లిపోయిన తరవాత పాపులర్ అయిపోతుందనే ధీమా కావచ్చు.
ఈ సాయంత్రం ఓ కాన్సెప్ట్ విడియో తో పాటుగా ఈ టైటిల్ ను విడుదల చేస్తారు. కేవలం టైటిల్ ను మాత్రం విడుదల చేస్తే కిక్ వుండదని, విడియో ఒకటి చేయించి, దాన్ని కలిపి వదులుతున్నారు.