Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాని వెర్సస్ నాని..అప్పటితో సరా?

నాని వెర్సస్ నాని..అప్పటితో సరా?

పాపం, ఏదో నోరు జారి, మాట జారారు హీరో నాని. దాంతో ఆంధ్రలో అతలాకుతలం అయిపోయింది థియేటర్ల పరిస్థితి. లైసెన్స్ లు, ఫారమ్ బి లు, సేఫ్టీ రెన్యువల్స్ అన్నీ గుర్తుకువచ్చాయి అధికారులకు. చాలా థియేటర్లు మూతపడ్డాయి. విఆర్వోలకు థియేటర్ డ్యూటీలు పడ్డాయి. ఆర్డీవోలకు మరో పని లేకుండా ఏ రేట్లకు అమ్ముతున్నారో చెక్ చేయడమే పని అయింది. 

కట్ చేస్తే... ఎగ్జిబిటర్లు అంతా మంత్రి నాని దగ్గరకు వెళ్లారు. లైసెన్స్ లు రెన్యూవల్స్ కు కొంత వెసులు బాటు ఇచ్చారు. సేఫ్టీ లైసెన్స్ ల సంగతి తెలియదు. అవి వుండి రన్ చేస్తున్నారో, లేకుండా రన్ చేస్తున్నారో అధికారులకే తెలియాలి. 

ఇలాంటి టైమ్ లో పండగ సినిమాలు వచ్చాయి. దాంతో మళ్లీ రేట్లకు గేట్లు ఎత్తేసారు. రాయలసీమలో ఏకంగా యూనిఫారమ్ రేటు 200 అమ్మినా అడిగే నాధుడు లేడు. ఆంధ్రలో అవకాశం, ధైర్యం వున్నవారు పాత రేట్లు అమ్మేస్తున్నారు. అడిగితే చూసుకోవచ్చు అని మళ్లీ మొదలుపెట్టేసారు.

దీంతో మళ్లీ సినిమాలకు కాస్త మంచి ఫిగర్లు కనిపిస్తున్నాయి. పాపం ఎవరయ్యా నష్టపోయింది అంటే శ్యామ్ సింగ రాయ్ నిర్మాత పూర్తిగా. పుష్ప సినిమా నిర్మాత కొంత వరకు. బహుశా హీరో నాని మాట్లాడకుండా వుండి వుంటే ఆ సినిమా పరిస్థితి బాగుండేదేమో?

నాని హీరో పరిస్థితి అలా వుంటే హీరో నాగ్ కోసం ఏకంగా కర్ఫ్యూ, కోవిడ్ అంక్షలే వాయిదా వేసేసారు. వడ్డించేవాడు మనవాడు అయితే ఇలా వుంటుంది. పగవాడు అయితే అలా వుంటుంది అనుకోవాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?