ప్రేమమ్ సినిమాతో తెలుగువాళ్లకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ మెలమెల్లగా బిజీ అవుతోంది. తెలుగులో మీడియం హీరోల పక్కన చాన్స్ లు సంపాదించుకుంటూ వస్తోంది. టాప్ హీరోల పక్కన వేయడానికి మాత్రం సెట్ కావడం లేదు. ఇలాంటి టైమ్ లో మెల్లిగా పక్క భాషల మీద దృష్టి పెడుతోంది.
లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమాలో చాన్స్ వెదుక్కుంటూ వచ్చింది. పునీత్ రాజకుమార్ హీరోగా నిర్మించే నటసార్వభౌమ సినిమాలో అనుపకు చాన్స్ వచ్చింది. సాధారణంగా కన్నడ హీరోయిన్లను మన దగ్గరకు తీసుకుంటాం. అలాంటిది, మలయాళం నుంచి మన దగ్గరకు వచ్చిన కేరళ కుట్టి అనుపమను, కన్నడిగులు పిలిచి మరీ ఆఫర్ ఇవ్వడం విశేషమే.
ప్రస్తుతం అనుపమ చేతిలో రెండు మూడు తెలుగు సినిమాలు వున్నాయి. కన్నడం లో కూడా క్లిక్ అయితే ఇక మరింత బిజీ అయిపోతుంది.