ఎన్టీఆర్ బయోపిక్ రూపురేఖలు అన్నీ కొంచెం కొంచెం మారుతున్నాయి. డైరక్టర్ గా క్రిష్ రంగ ప్రవేశం చేసాక ఎన్టీఆర్ బయోపిక్ లెవెల్ మారిపోతోంది. రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించడం ఓ పెద్ద మలుపు. ఆ తరువాత ఇక పాపులర్ స్టార్ కాస్ట్, థియేటర్ ఆర్టిస్టులను కలగలిపి సినిమా చేయాలనుకోవడం ఇంకో మలుపు.
ఎన్టీఆర్ బయోపిక్ అంటే తీసుకున్నవారికి తీసుకున్నంత. అంత సుదీర్ఘయానం వుంది. తెలుగువారికి తెలిసిన సినిమా తారలందరనీ కొలుపు తీర్చవచ్చు. అలనాటి హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ నటులు ఇలా ఎవరినైనా చూపించాలనుకుంటే చూపించవచ్చు.వద్దనుకుంటే స్క్రిప్ట్ లో లేపయవచ్చు.
ఏ పాత్రలు చూపాలి. దానికి ఎవర్ని తీసుకోవాలి అన్నది కేవలం ఇటు క్రిష్ అటు బాలయ్య మాత్రమే చూసుకుంటున్న వ్యవహారాలు. ఇప్పటి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కు రానా ను తీసుకున్నారన్న సంగతి తెలిసిందే. జూలై రెండో వారం లేదా మూడోవారం తరువాత నుంచి అందుబాటులోకి వస్తాడట రానా.
ఇదిలా వుంటే ఎన్టీఆర్ బయోపిక్ లో హీరో కృష్ణ క్యారెక్టర్ లో నటించడానికి ఆయన తనయుడు మహేష్ బాబును ఒప్పించినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు బాలయ్యే నేరుగా అడిగినట్లు, దానికి మహేష్ ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, బయోపిక్ కు మరింత ఆకర్షణీయం అవుతుంది. కాస్త క్రేజ్ వున్న యాక్టర్లు తోడవుతుంటే సినిమా రేంజ్ ఓ రేంజ్ కు చేరుకుంటుంది.