ఆ పాట డిజిట‌ల్ వ్యూస్ సంపాద‌నే రూ.కోట్ల‌లో..?

క‌రోనా వ్యాప్తి – లాక్ డౌన్ కు పూర్వం సోష‌ల్ మీడియాలో ఒకే పాటే మార్మోగుతూ ఉండేది. అదే 'నీలీ నీలీ ఆకాశం..' సంచ‌లన స్థాయిలో ఆ పాట మార్మోగింది. సిటీల నుంచి ప‌ల్లెల…

క‌రోనా వ్యాప్తి – లాక్ డౌన్ కు పూర్వం సోష‌ల్ మీడియాలో ఒకే పాటే మార్మోగుతూ ఉండేది. అదే 'నీలీ నీలీ ఆకాశం..' సంచ‌లన స్థాయిలో ఆ పాట మార్మోగింది. సిటీల నుంచి ప‌ల్లెల వ‌ర‌కూ పండితుల నుంచి పామ‌రుల వ‌ర‌కూ ఆ పాట‌ను ఆస్వాధించారు. అల వైకుంఠ‌పురంలో సినిమా పాట‌ల త‌ర్వాత దాదాపుగా వాటిని మించిన స్థాయిలో క‌ల్ట్ హిట్ అయ్యింది నీలీ నీలీ ఆకాశం.

ఇప్పుడు ఆ వీడియో సాంగ్ ఏకంగా 200 మిలియ‌న్ల వ్యూస్ ను సాధించింద‌ట‌. అంటే దాదాపు 20 కోట్ల వ్యూస్. ఇవ‌న్నీ యూట్యూబ్ వ్యూసే. మ‌రి ఈ వ్యూస్ కు గానూ ఆ పాట ఎంత వ‌ర‌కూ సంపాదించి ఉంటుంద‌నే అంశం గురించి ఒక ర‌ఫ్ అంచ‌నాకు రావొచ్చు.

ప్ర‌తి మిలియ‌న్ వ్యూస్ కూ యూట్యూబ్ లో అప్ లోడ‌ర్ కు దాదాపు 500 డాల‌ర్ల వ‌ర‌కూ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎంట‌ర్ టైన్ మెంట్ కేట‌గిరి కాబ‌ట్టి యాడ్ రెవెన్యూ బానే ఉంటుంది. ఒక్క మిలియ‌న్ కు 500 డాల‌ర్లు అంటే.. ప‌ది మిలియ‌న్ల వ్యూస్ కు 5000 డాల‌ర్లు. వంద మిలియ‌న్ల వ్యూస్ కూ 50,000 డాల‌ర్లు. రెండు వంద‌ల మిలియ‌న్ల‌కూ దాదాపు దాదాపు ల‌క్ష డాల‌ర్లు! అంటే సుమారు 70 ల‌క్ష‌ల రూపాయ‌లు!

కేవ‌లం ఆ పాట యూట్యూబ్ వ్యూస్ ద్వారానే దాని అప్ లోడ‌ర్ల‌కు అంత డ‌బ్బు వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. ఇక ఇప్పుడు పాట‌ల‌కు యూట్యూబ్ కు మించిన స్థాయిలో ఇత‌ర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ ఉండ‌నే ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఒరిజిన‌ల్ హ‌క్కుదార్ల‌కు బాగానే డ‌బ్బు వ‌చ్చి ఉండే అవ‌కాశం ఉంది. ఇలా చూస్తే.. ఆ సినిమా కు సంబంధించి ఒక్క పాట ద్వారానే ఆదాయం రూ.కోట్ల‌లో ఉండే అవ‌కాశం ఉంది. ఎలాగూ అది చిన్న‌బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో.. విడుద‌ల‌తో సంబంధం లేకుండా ఆడియో ద్వారానే కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరుతున్న‌ట్టుగా ఉంది!

ఆర్‌కే రాత‌ల‌కు అర్థాలే వేరులే

దిల్ రాజు ముందు చూపు