నీళ్లు వంటబట్టాయి

టాలీవుడ్ లో అడుగుపెడుతూనే ఇతర భాషల హీరోయిన్లు ఎలా వుంటే ఇక్కడ నెగ్గుకు రాగలమన్నది ఇట్టే పట్టేస్తారు. సూర్య వెర్సస్ సూర్య చేసిన త్రిథా చౌదరి కూడా ఇందుకు మినహాయింపు కాదు. భలే భలే…

టాలీవుడ్ లో అడుగుపెడుతూనే ఇతర భాషల హీరోయిన్లు ఎలా వుంటే ఇక్కడ నెగ్గుకు రాగలమన్నది ఇట్టే పట్టేస్తారు. సూర్య వెర్సస్ సూర్య చేసిన త్రిథా చౌదరి కూడా ఇందుకు మినహాయింపు కాదు. భలే భలే కబుర్లు చెప్పేస్తోంది. ఖాళీ దొరికితే చాలు ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తోందట. 

ఎన్టీఆర్ డ్యాన్స్ లు అంటే భలే ఇష్టమట..అవసరమైతే ఎలాంటి కాస్ట్యూమ్ లోనైనా ఓకె నట. అవసరమైతే బికినికి కూడా సై అంట. నా ఫిజిక్ బాగానే వుంటుందిగా..అని మళ్లీ సమర్థించుకుంటోంది ఈ బెంగాలీ అమ్మడు. కావాల్సిందల్లా టాలీవుడ్ లో నాలుగు సినిమాలు. 

ఎలాగూ నటనలో మాంచి మార్కులే తెచ్చుకుంది కాబట్టి,గ్లామర్ ఒలకబోసి పాగా వేయాలనుకుంటోంది త్రిథ.