టీవీల్లో యాంకరింగ్ చెయ్యడానికి అందమొక్కటే అమ్మాయిలకు సరిపోదు. దానితో పాటుగా తెలివితేటలూ, సమయస్ఫూర్తి కూడా ఎంతో అవసరం అని చెబుతోంది స్టార్ యాంకర్ సుమ. ఇప్పుడు యాంకర్స్ అవసరం ఎంతో ఉంది. ఎన్నో ఛానెల్స్ ఉన్నాయి కానీ టాలెంట్ ఉన్న యాంకర్స్ రావడం లేదు.
మేమింత కాలం నిలబడ్డామంటే కారణం పోటీ ఇచ్చే టాలెంటెడ్ యాంకర్స్ లేకపోవడమే కదా. ఉంటే అన్ని ప్రోగ్రాంస్ మాకే ఎందుకొస్తాయి. ఇప్పటి అమ్మాయిలకు చక్కటి వాగ్ధాటి, జోవియల్‌గా ఉండే తత్వంతో పాటు లోకజ్ఞానం కూడా తెలుసుండాలి.
నాది తెలుగు మాతృభాష కాకపోయినా భాషలో పట్టు సాధించడం వల్ల సక్సెస్ కాగలిగాను. అలాగే ప్రోగ్రాంని రక్తి కట్టించే నేర్పరితనం కూడా తెలిసుండాలి. నన్ను యాంకరింగ్ నేర్పించమని చాలామంది అడుగుతుంటారు. కానీ నాకు అంత టైముండదు. నేర్పితే రావడానికి యాంకరింగ్ మ్యాథమెటిక్స్ కూడా కాదు.
సృజనకు పదును పెట్టుకోవాలి. సరైన దృష్టి పెడితే యాంకరింగ్‌లో ఎంతో ఉపాధి పొందవచ్చు. మంచి ప్రతిభ ఉన్న యాంకర్స్ వచ్చిన రోజు ఆటోమెటిగ్గా మమ్మల్ని తప్పించేస్తారు. అలాంటి వాళ్లు రావాలని కోరుకుంటున్నాను అని చెబుతుంది సుమ.