పవిత్రంగా ఉంటేనే స్త్రీలకు విలువుంటుంది

పవిత్రత విషయానికొస్తే మగాళ్లకయినా ఆడాళ్లకయినా అది ఉండాల్సిందే. కాకపోతే ఆ విషయంలో అమ్మాయిల మీదే ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. అబ్బాయి గతం గురించి పట్టించుకోరు గానీ అమ్మాయి గతాన్ని భూతద్దంలోంచి పరిశీలిస్తారు. తెలిసో తెలీకో…

పవిత్రత విషయానికొస్తే మగాళ్లకయినా ఆడాళ్లకయినా అది ఉండాల్సిందే. కాకపోతే ఆ విషయంలో అమ్మాయిల మీదే ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. అబ్బాయి గతం గురించి పట్టించుకోరు గానీ అమ్మాయి గతాన్ని భూతద్దంలోంచి పరిశీలిస్తారు. తెలిసో తెలీకో ఆ పవిత్రతని కోల్పోయాను. అది ఉంటే ఇంకెంతో గౌరవం పొంది ఉండేదాన్ని అని ఇప్పుడు వాపోతుందట సన్నీలియోన్‌. 

విదేశాల్లో పుట్టి పెరిగిన భారత సంతతికి చెందిన సన్నీలియోన్‌ నీలిచిత్రాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వెండి తెరపై కూడా ఎంతో పేరు తెచ్చుకున్న సన్నిలియోన్‌ జీవితాన్ని డాక్యుమెంటరీగా ప్రెజెంట్‌ చెయ్యడానికి ఒక సంస్థ ముందుకు వచ్చిందట. తన గురించి దాచడానికి ఏమీ లేదని ఇంకా ఎంతో చెప్పాల్సిన పని కూడా లేదనీ, డాక్యుమెంటరీ తీసే వాళ్లకి సహకరిస్తానని చెబుతుంది. 

ఇండియా వచ్చాక ఇక్కడి స్త్రీలను పరిశీలించినప్పుడు పవిత్రతకు ఇచ్చే విలువను గుర్తించాను. అలాంటి స్త్రీలను ఇక్కడ ఎంతో గౌరవంగా చూస్తారు. పెళ్లి జరగడానికి అది అత్యంత అవసరం కూడా. నాకు ఇవన్నీ తెలీని టైంలోనే నేను చెయ్యాల్సినవి చేసేశాను. చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను కొన్ని చోట్ల తల దించుకుంటున్నాను. ఎంతయినా భారతీయ మూలాలు నాలో ఉండడం వల్లేనేనేమో నేను ఇలా ఆలోచిస్తున్నాను కాబోలు. సమాజ హితవు కోసమే కాదు. శారీరక ఆరోగ్యానికీ పవిత్రత ఎంతో అవసరం అని చెబుతుంది సన్నీలియోన్‌.