సిగ్గు లేదా నీకు అని తిట్టిపోస్తారు కానీ.. సిగ్గు ఉండటం వల్ల ఎంత మంది ఆడపిల్లలు బాగుపడ్డారు చెప్పండి. సిగ్గు అనేది మనిషిని వెనక్కినెట్టేస్తుంది అని చెబుతుంది నీలి సుందరి సన్నీలియోన్.
నిజంగా నేను సిగ్గుపడి ఉంటే లండన్లో నీలి చిత్రాల్లో పాల్గొని ఉండేదాన్నా? వాటి ద్వారా సినీ తారని అయ్యుండే దాన్నా?. నన్ను చాటుగా తిట్టుకుని మనసులో వెలి వేసిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. వాళ్లు నేను చేసినవి చెయ్యలేరు. అంత దమ్ము వాళ్లకు లేదు. అయితే నేను మాత్రం రెగ్యులర్ హీరోయిన్స్ చేసే పాత్రలన్నీ చేయగలను అని చిర్రు బుర్రులాడుతుంది సన్నీలియోన్.
నా చరిత్ర తెరిచిన పుస్తకం. దాపరికాలు లేవు. కొంత మంది హీరోయిన్స్ చరిత్రలు మాత్రం సస్పెన్స్ ధ్రిల్లర్స్‌లా ఉంటాయి. ఈ ప్రపంచం ఎంతో ముందుకెళ్లిపోయింది. మడిగట్టుకుని కూర్చుంటే పనవ్వదని నేను 13 ఏళ్లకే గమనించాను. ఇప్పుడు నన్ను పబ్లిగ్గా ఎవ్వరూ విమర్శించలేరు. వాటిని నేను లెక్క చెయ్యను కూడా. నటిగా నా గోల్ సక్సెస్ అవ్వాలి. పైసల్ సంపాదించాలి. దట్సాల్ అంటోంది సన్నీలియోన్.