అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఈమెకు గ్లామర్ కావలసినంత ఉంది. దర్శకుడు ఎలా చెబితే అలా చేస్తానంటుంది. బికినీకు కూడా రెడీ అంటుంది. అయినా అవకాశాలు రాకపోవడం దురదృష్టకరం కాక ఇంకేమిటి. ఇంతకూ ఆవిడ ఎవరో కాదు.. ఎప్పుడో 2005లో ‘సోగ్గాడు’ చిత్రంలో తరుణ్‌తో నటించిన హీరోయిన్ సంజన.
అప్పటి నుండీ ఇప్పటిదాకా స్ట్రగుల్ పడుతూనే ఉంది. మధ్య మధ్యలో సత్యమేవజయతే, పోలీస్ పోలీస్ దుశ్శాసన, ముగ్గురు..సినిమాలు చేసినా అవన్నీ టుమ్రీలగానే మిగిలిపోయాయి. సింధి కుటుంబానికి చెందిన సంజన జుగల్ రాణి ఊహ తెలిసేనాటికే మోడలింగ్ అంటూ పరుగులు పెట్టి సినిమాల్లోకొచ్చి పడింది. అడపా దడపా కన్నడ, తమిళ్ చిత్రాల్లో చేస్తుంది కానీ ఆవిడ గురి పెట్టింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమకేనని అర్ధం అవుతుంది.
తెలుగు సినిమాల్లో కాస్త వయసు మళ్లిన స్టార్ హీరోలు తమ పక్కన ఛాన్స్ ఇస్తే ఎంతో కొంత కళాతృష్ణ తీర్చుకోవాలని సంజన ఆలోచనట. ఇప్పటికే ఫేస్ బుక్‌లో ఒక ఖాతా తెరిచి, ఖాళీగా ఉన్నప్పుడల్లా సెక్సీగా ఫోటోలు తీయించుకొని అప్‌లోడ్ చేస్తున్న అమ్మడికి అవకాశాలు రావడం లేదట. పన్లో పనిగా షాపుల ఓపెనింగ్స్‌కూ, హలీమ్ రుచులు చూడటానికి కూడా సంజన వెళుతుంది.
సంజనలో అన్నీ ఉన్నాయి. నటనతో సహా.. తగిన ఉత్సాహం కూడా బోలెడు ఉంది. ఇలాంటి హీరోయిల్ని ఆదరించకపోవడం మన దర్శక,నిర్మాతల దురదృష్టకరం అంటోంది సంజన.