నిహారిక.. నెక్ట్స్ ఏంటీ?

ఒక్క మనసు సినిమాతో స్క్రీన్ మీదకు వచ్చింది కొణిదెల హీరోయిన్. వస్తూనే మెగా ప్రిన్సెస్ అని, మెగా హీరోయిన్ అని అభిమాన జనాలు మోసేయడం మొదలుపెట్టారు. కానీ తొలిసినిమా ఫట్ మనేసింది. ఆ డైరక్టర్…

ఒక్క మనసు సినిమాతో స్క్రీన్ మీదకు వచ్చింది కొణిదెల హీరోయిన్. వస్తూనే మెగా ప్రిన్సెస్ అని, మెగా హీరోయిన్ అని అభిమాన జనాలు మోసేయడం మొదలుపెట్టారు. కానీ తొలిసినిమా ఫట్ మనేసింది. ఆ డైరక్టర్ రామరాజుకు మళ్లీ ఇప్పటివరకు సినిమా లేదు. మలి సినిమా హ్యాపీ వెడ్డింగ్ కూడా డిజాస్టరే. ఆ డైరక్టర్ కు మళ్లీ సినిమా లేదు.

తమిళంలో ఓ సినిమా చేసినా, దాని హడావుడే లేదు. రెండు వెబ్ సిరీస్ లు ప్రవీణ్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో చేసిన నిహారిక అదే డైరక్టర్ తో ఇప్పుడు మిసెస్ సూర్యకాంతం సినిమా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమానే నిహారికకు ఆఖరి అవకాశం అనుకోవాలి. ఈ సినిమా టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది కానీ, ట్రయిలర్ వచ్చేసరికి చప్పబడింది.

ఈ సినిమా హిట్ అనిపించుకుంటే నిహారికకు మరో సినిమా అవకాశం వుంటుంది. లేదూ అంటే మెగా నటుల బృందంలో ఓ నటిగా మిగిలిపోతుంది. సూర్యకాంతం సినిమాను నిర్మించి నిర్వాణ ఫిలింస్ కు కూడా ఈ సినిమా ఆసిడ్ టెస్ట్. యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి సినిమాలు అందించిన ఈ సంస్థ నిర్మాణంలోకి దిగి తొలిసినిమా మనుతో దారుణంగా దెబ్బతింది. నష్టాలు చవిచూసింది. మలి సినిమాగా సూర్యకాంతం అందిస్తున్నారు.

ఈ సినిమాను దాదాపు డైరక్ట్ రిలీజ్ చేసుకుంటున్నారు. అసలే ఎన్నికలు, జనాల దృష్టి అంతా అటే వుంది. ఇలాంటి నేపథ్యంలో విడుదల చేస్తున్న సూర్యకాంతం ఎలా వుంటుందో చూడాలి. ఇది సక్సెస్ అయితేనే నిర్వాణ సంస్థ మళ్లీ నిర్మాణం వైపు చూసే అవకాశం వుంటుంది. మొత్తంమీద ఇటు నిహారిక, అటు నిర్వాణ రెండింటికీ సూర్యకాంతం విజయం కీలకం కానుంది.

పవన్ కళ్యాణ్ కొత్తగా రాలేదు.. నాగబాబు హీరో కాదు