అటుఇటు తిరిగి అదే పేరు పెట్టారు

తన సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలంటూ ఆమధ్య సోషల్ మీడియాలో చిన్న పజిల్ వదిలాడు నిఖిల్. జనాలు ఏవేవో ఆప్షన్లు ఇచ్చారు. నిఖిల్ కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నాడు. కానీ ఫైనల్ గా…

తన సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలంటూ ఆమధ్య సోషల్ మీడియాలో చిన్న పజిల్ వదిలాడు నిఖిల్. జనాలు ఏవేవో ఆప్షన్లు ఇచ్చారు. నిఖిల్ కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నాడు. కానీ ఫైనల్ గా తన కొత్త సినిమాకు కిర్రాక్ పార్టీ అనే పేరునే ఫిక్స్ చేశాడు.

కన్నడంలో హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాకు ఒరిజినల్ టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఇప్పటికే జనాల్లో ఈ టైటిల్ బాగా పాపులర్ అయింది కాబట్టి అదే పేరును కొనసాగించాలని నిర్ణయించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తాజాగా ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

కిర్రాక్ పార్టీతో శరణ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా.. మరో దర్శకుడు చందు మొండేటి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్నాడు.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జా హీరోయిన్లుగా తెలుగుతెరకు పరిచయమౌతున్నారు. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. త్వరలోనే టైటిల్ లోగోను విడుదల చేసి, రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.