కథానాయకుడిగా నిలదొక్కుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించాడు సుమంత్. ఏమో గుర్రం ఎగరావచ్చేమో… అంటూ ఆశావహ థృక్పధంతో సినిమాలు చేస్తూ వచ్చాడు. పరాజయాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. అలాగని ఫలితమూ దక్కలేదు. చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఒక దశలో సుమంత్ అంటే… మార్కెట్ వర్గాల్లో నీరసం వచ్చే పరిస్థితి తలెత్తింది.
దీంతో సుమంత్ కొన్నాళ్లపాటు నటించకపోవడమే బెటర్ అనుకొంటున్నాడట. ఇకనుంచి చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకొన్నాడట. ఆ మేరకు కొత్త దర్శకులు చెబుతున్న కథల్ని వింటున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే చిన్న చిత్రాల్ని నిర్మించాలని సుమంత్ భావిస్తున్నాడట. ఇప్పటికే నిర్మాణ వ్యవహారాల్ని ముమ్మరం చేశాడనీ, నాలుగైదు కథల్ని సిద్ధంగా ఉంచుకొన్నారని తెలుస్తోంది.
మరి ఈ కొత్త ప్రయత్నమైనా సుమంత్‌కి ఫలితాలు తీసుకొస్తాయేమో చూడాలి. అన్నపూర్ణ సంస్థలో ఇదివరకు తెరకెక్కిన పలు చిత్రాల నిర్మాణ వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకొన్న అనుభవం సుమంత్‌కి ఉంది. దీంతో ఆయన నిర్మాతగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.