ఎమ్బీయస్‌ : రీడర్‌షిప్‌ సర్వే – తప్పుల తడక

ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే 2013 వెలువడింది. దాని ఆధారంగానే పత్రికలకు ప్రకటనలు వస్తాయి. ఆ సర్వే ఎంత అధ్వాన్నంగా తయారైందో చూస్తే నవ్వూ, ఏడుపూ కలిసి వస్తాయి. దాని ప్రకారం – ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు,…

ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే 2013 వెలువడింది. దాని ఆధారంగానే పత్రికలకు ప్రకటనలు వస్తాయి. ఆ సర్వే ఎంత అధ్వాన్నంగా తయారైందో చూస్తే నవ్వూ, ఏడుపూ కలిసి వస్తాయి. దాని ప్రకారం – ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, ఇంగ్లీషు అన్ని పత్రిక పాఠకుల సంఖ్య 30% నుండి 65% వరకు తగ్గిపోయింది. పంజాబ్‌లో 35% తగ్గిపోయింది. హరియాణాలో మాత్రం 17% పెరిగిపోయింది. 

తమిళనాడులో ఇంగ్లీషు పత్రికల పాఠకుల సంఖ్య 38% తగ్గిపోయింది. ఢిల్లీలో 20% తగ్గిపోయింది. ముంబయిలో మాత్రం 20% పెరిగింది. 

హిందూ వారు ప్రచురించే వాణిజ్యదిన పత్రిక ''బిజినెస్‌ లైన్‌'' పాఠకులు చెన్నయ్‌లో కంటె మణిపూర్‌లో మూడు రెట్లు ఎక్కువ వున్నారు! 

నాగపూర్‌ నుండి వెలువడే ''హితవాద'' అనే ఇంగ్లీషు పత్రికకు 60 వేల సర్క్యులేషన్‌ వున్నట్టు సర్టిఫికెట్‌ వుంది. కానీ దానికి ఒక్క పాఠకుడు కూడా లేడని సర్వే చెపుతోంది. ఈ నివేదిక తయారుచేసినవాళ్లకు కామన్‌ సెన్సు కూడా లోపించిందని పైపైన చూసినా తెలుస్తోంది. వీళ్లు సర్క్యులేషన్‌ను లెక్కలోకి తీసుకోలేదు. ఎబిసి – యాజమాన్యం చెప్తున్న సర్క్యులేషన్‌ కరక్టో కాదో ఆడిట్‌ చేసి సర్టిఫికెట్‌ యిచ్చే సంస్థ – అంకెలకు దీనికీ పోలిక లేదు. సర్వే అంకెలను పట్టించుకోకూడదని ప్రకటనదారులను కోరుతూ, ఈ సర్వేను ఉపసంహరించాలని కోరుతూ అనేక పబ్లికేషన్స్‌ సంయుక్త ప్రకటన చేశాయి. దానిపై సంతకాలు పెట్టిన సంస్థలు – హిందూ, సాక్షి, ఇండియా టుడే, ఔట్‌లుక్‌, బెనెట్‌ కోల్మన్‌, ఆనందబజార్‌ పత్రిక, స్టేట్స్‌మన్‌, దైనిక్‌ జాగరణ్‌, లోకమత్‌, దినకరన్‌, మిడ్‌ డే వగైరా!

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]