యాక్షన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ‘పందెంకోడి’ విశాల్ రాన్రానూ మహా రొమాంటిక్ అయిపోతున్నాడు. వరుస ఫ్లాప్స్‌తో కొంతకాలం డీలా పడ్డ విశాల్‌కి మళ్లీ ఈమధ్యే కొంచెం జోష్ వచ్చింది. తన కొత్త సినిమా ఇంద్రుడులో విశాల్ వెరీ రొమాంటిక్‌గా కనిపించబోతున్నాడు.
ఈ సినిమాలో విశాల్, లక్ష్మీమీనన్‌పై ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా తీసారు. అయితే ఈ ముద్దు తెర మీదకి వచ్చే అవకాశాల్లేవని అంటున్నారు. ఈ లిప్ లాక్ వల్ల ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు ససేమీరా అందట. తమిళనాడులో క్లీన్ యు సినిమాలకి ముప్పయ్ శాతం పన్ను మినహాయింపు ఉంటుంది.
అది పోగొట్టుకుంటే ఈ ముద్దు ఆ ముప్పయ్ శాతం నష్టాన్ని రికవర్ చేస్తుందా లేదా అనే అనుమానం యూనిట్‌ని పీడిస్తోంది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని ఈ సీన్ తీసేయడానికే మొగ్గు చూపుతున్నారని వినిపిస్తోంది. మరీ అవసరం అయితే ఈ లిప్ లాక్‌ని యూట్యూబ్‌లో లీక్ చేసి క్రేజ్ తెచ్చుకోవచ్చని అనుకుంటున్నారట. అన్నట్టు ఈ ముద్దు సీన్ స్టిల్‌ని కూడా విశాల్ స్నేహితుడు ట్విట్టర్‌లో లీక్ చేసాడు. గట్టి స్కెచ్చే అనిపిస్తోంది కదూ!