నిర్మాత గా రవితేజ

హీరోలు అందరూ నిర్మాతలుగానో, నిర్మాణ భాగస్వాములుగానో మారుతున్నారు. తమ దగ్గరకు వచ్చిన మంచి సబ్జెక్ట్ లను సినిమాలుగా తమే నిర్మించడమో, లేదా తాము చేసే సినిమాల్లో భాగస్వామ్యం తీసుకోవడమో చేస్తున్నారు. మహేష్ బాబు దగ్గర…

హీరోలు అందరూ నిర్మాతలుగానో, నిర్మాణ భాగస్వాములుగానో మారుతున్నారు. తమ దగ్గరకు వచ్చిన మంచి సబ్జెక్ట్ లను సినిమాలుగా తమే నిర్మించడమో, లేదా తాము చేసే సినిమాల్లో భాగస్వామ్యం తీసుకోవడమో చేస్తున్నారు. మహేష్ బాబు దగ్గర నుంచి నాని వరకు ప్రతి ఒక్కరు ఇదే బాట.

అయితే హీరో రవితేజ ది వేరే పద్దతి. ఆయన వీలయినంత వరకు బాదరబందీలు పెట్టుకోరు. చేసామా, మన పారితోషికం తీసుకున్నామా, అయిపోయిందా, లేదా..ఇదే తీరు. కానీ ఇప్పుడు ఆయన కూడా తీరు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. లాభాల్లో వాటా తీసుకునే పద్దతి మీద సినిమాలు చేయడం అన్నది ఇప్పటికే ప్రారంభించినట్లు బోగట్టా.

అంతేకాకుండా తనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, చిన్న, మీడియం సినిమాలు నిర్మించే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎప్పటికి మెటీరియలైజ్ అవుతుందన్నది తెలియదు.ప్రస్తుతానికి అయితే రవితేజ కు ఈ ఆలోచన మాత్రం వచ్చిందన్నది పక్కా బోగట్టా.

త్రివిక్రమ్ ని 'గారు' అని ఎందుకు పిలవాలి