తన సినిమాలను చాలా రిచ్ బ్యాక్ గ్రౌండ్స్ లో తీయడాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. మధ్యలో మధ్యతరగతి కష్టాలనూ ప్రస్తావిస్తున్నా.. త్రివిక్రమ్ సినిమాల్లో చాలా క్యారెక్టర్లు ఆల్ట్రా రిచ్ గానే ఉంటాయి. హీరోనో, హీరోయినో.. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలన్నీ అత్యంత ఖరీదైన జీవన శైలితోనే కనిపిస్తాయి. దానికి అల వైకుంఠపురం కూడా మినహాయింపు కాదు.
ఖలేజా, అత్తారింటికి దారేదీ, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..ఇలాంటి సినిమాల్లో హీరోకో, హీరోయిన్ కో చాలా ఖరీదైన సెటప్ కనిపిస్తుంది. అత్తారింటికీ దారేదీ అయితే మరింత హై రేంజ్! అలా కోటీశ్వరుల కథలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా విషయంలో మరింత రిచ్ నెస్ కోసం చాలా ప్రయత్నాలే చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి.
అవేమిటంటే.. వీలైనంతమంది ఫారెన్ మోడల్స్, ఫారెన్ ఫైటర్స్ తో తెరను నింపేయడం. అల వైకుంఠపురంలో సినిమాలో పలు పాటలను, సీన్లను ఫారెన్ లొకేషన్లలో తీశారు. వాటిల్లో ఫారెనర్స్ కనిపిస్తే వింత ఏమీ లేదు. అయితే ఇండియా సీన్లలో, ఇంట్లో సీన్లలో కూడా త్రివిక్రమ్ ఫారెనర్స్ ను చూపించాడు.
ఆఖరుకు ఎంతలా ఉంటే.. బ్రహ్మాజీ వెంట ఉండే రౌడీలు కూడా ఫారెనర్సే! ఇంట్లో పార్టీ పాటలో డ్యాన్సులేసే అమ్మాయిలూ ఫారెనర్సే! పాటల్లో అమ్మాయలను, ఫైట్లలో ఫైటర్లను కూడా తెల్లతోలు వాళ్లనే చూపించాడు త్రివిక్రమ్. ఇలా ఇండియాలో సాగే సినిమాలో రౌడీ బ్యాచ్ ను కూడా ఫారెనర్స్ గా చూపి త్రివిక్రమ్ రిచ్ నెస్ ను చాటుకుంటున్నట్టుగా ఉన్నాడు. బహుశా తెల్లతోలుతో స్క్రీన్ కు రిచ్ నెస్ వస్తుందనేది ఈ దర్శకుడి భావనా?