నిర్మాతతో స్టే ఫ్రీ కొనిపించిన హీరోయిన్

సినిమాలు తీస్తున్న నిర్మాతల గోడు ఓ లెక్కలో వుంటుంది. ఇటీవల ఓ చిన్న సినిమా తీసిన ఓ నిర్మాతతో కొద్ది నిమషాలు మాట్లాడడం జరిగింది. ఈ నిర్మాత కొంతమంది చిన్న హీరోయిన్లను తీసుకుని, ఓ…

సినిమాలు తీస్తున్న నిర్మాతల గోడు ఓ లెక్కలో వుంటుంది. ఇటీవల ఓ చిన్న సినిమా తీసిన ఓ నిర్మాతతో కొద్ది నిమషాలు మాట్లాడడం జరిగింది. ఈ నిర్మాత కొంతమంది చిన్న హీరోయిన్లను తీసుకుని, ఓ చిన్న సినిమా చేసారు. విడుదల చేయాల్సి వుంది. సినిమాకు ఎంత ఖర్చయి వుంటుంది అని ఎవరైనా అడిగితే, గొల్లు మంటున్నాడు.

చూడడానికి చిన్న సినిమాలా వుంది? ఇంత ఖర్చయిందా? అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి..అంటూ లిస్ట్ బయటకు తీస్తున్నాడు. వేరే రాష్ట్రానికి చెందిన ఓ హీరోయిన్ పెట్టించిన ఖర్చు ఎలా వుంటుందో వివరిస్తున్నాడు. రెండు అక్షరాల పేరు, మూడు అక్షరాల సర్ నేమ్ వుండే ఆ హీరోయిన్ ఖర్చు ఇలా వుంటుందీ అంటూ వివరించాడు. 

తల్లికి కూతురికి టికెట్ తీయాలి. టికెట్ కాస్త తక్కువ వున్నపుడు తీస్తే, ఎగస్ట్రా లగేజీ బిల్లు అంతకు డబుల్ వుంటుంది. రాగానే ఓ ఇన్నోవా ఇవ్వాలి. మళ్లీ వెనక్కు పంపరు. ఫుడ్ బిల్ ఓ రేంజ్ లో వుంటుంది.

లాడ్జిలో దిగిన తరవాత అండర్ వేర్ లు కూడా వాషింగ్ కు ఇస్తారు. బిల్లు వాచిపోతుంది. ఆఖరికి స్టే ఫ్రీ డబుల్ ఎక్స్ ఎల్ అంటూ ఆ బిల్లు కూడా నిర్మాతకే వేస్తారు. గట్టిగా మాట్లాడితే బ్యాక్ పెయిన్ అంటూ ఓ పూట ఎగ్గొడతారు. దాంతో నోరు మూుసుకు భరించాలి. 

ఇలా అంతా చేస్తే తెలుగులో అట్టే సినిమాలే చేయని, సినిమాలే లేని,  ఓ చిన్న హీరోయిన్ కు దాదాపు ఇరవై లక్షలు పైగా ఖర్చు అయిందట.