పాపం, హీరో నితిన్ కు స్వంత బ్యానర్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. సాధారణంగా హీరోలకు థియేటర్ రిలీజ్ అంటే ఆసక్తిగా వుంటుంది. అలాంటిది స్వంత బ్యానర్ పై నిర్మించిన అంథాధూన్ రీమేక్ 'మాస్ట్రో' ను ఓటిటికి ఇచ్చేస్తున్నారు.
ఆల్ మోస్ట్ డిస్షషన్లు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి. సినిమా మేకింగ్ లో వుండగానే 13.5 కోట్లకు శాటిలైట్ ప్లస్ డిజిటల్ కలిసి హక్కులకు ఆఫర్ వచ్చింది. ఆడియో ద్వారా కోటి రూపాయలు వచ్చింది.
అయితే లేటెస్ట్ గా టోటల్ ఓటిటి ఆఫర్ మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. హిందీ డబ్బింగ్ కాకుండా ముఫై రెండు కోట్లకు పైగా నిర్మాత సుధాకరరెడ్డి ఆశిస్తున్నారు. ఆ రేటు మీద డిస్కషన్లు జరుగుతున్నాయని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి. కానీ మరోపక్కన 28 కోట్లకు బేరం హాట్ స్టార్ తో సెటిల్ అయిపోయిందని వినిపిస్తోంది.
ఈ మొత్తం కాకుండా హిందీ డబ్బింగ్ మీద కనీసం మరో అయిదారు కోట్లు వస్తుంది. అంటే దాదాపు 34 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు. సినిమా రీమేక్, కాస్టింగ్, మేకింగ్ అన్నీ కలిపి రీజనబుల్ బడ్జెట్ లో ఫినిష్ చేసారు గోవా షెడ్యూలు కోసం తప్పిస్తే హైదరాబాద్ లో రీజనబుల్ బడ్జెట్ లోనే ఫినిష్ చేసారు.
అందువల్ల కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటిటి ఇవ్వడం అని నిర్మాత, హీరో తండ్రి సుధాకరరెడ్డి భావిస్తున్నారు. ఊ అనక తప్పడం లేదు హీరో నితిన్ కు.