నితిన్ హీరోగా కాదు, నిర్మాతగా

గరుడ వేగ సినిమా హిట్ కావడంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. అప్పడే ఓ రుమాలు పడిపోయింది. హీరో నితిన్ తన స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తనే…

గరుడ వేగ సినిమా హిట్ కావడంతో దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ఎంక్వయిరీలు మొదలయ్యాయి. అప్పడే ఓ రుమాలు పడిపోయింది. హీరో నితిన్ తన స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తనే ట్విట్టర్ లో ప్రకటించేసాడు. అయితే ఇక్కడే చిన్న తకరారు వుంది. అందరూ నితిన్ నే హీరోగా ప్రవీణ్ సత్తారుతో సినిమా చేస్తున్నాడేమో అని అనేసుకున్నారు.

కానీ అది కాదు విషయం. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నితిన్ బ్యానర్ ఓ సినిమా నిర్మిస్తుంది. ప్రవీణ్ తెచ్చే సబ్జెక్ట్ ను బట్టి, హీరో ఎవరు అన్నది ఆధారపడి వుంటుంది. అంతే కానీ నితిన్ హీరోగా మాత్రం కాదు.

ఈ విషయాన్నే ప్రవీణ్ సత్తారు కూడా కన్ఫర్మ్ చేసారు. నితిన్ స్వంత బ్యానర్ లో ఓ సినిమా చేయడం పక్కా, హీరో ఎవరు అన్నది, ప్రాజెక్టు ఫైనల్ అయ్యాక తేలుతుంది అని ఆయన చెబుతున్నారు. 

నితిన్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక రాధామోహన్ నిర్మాతగా ఓ సినిమా చేయాల్సి వుంది.