నితిన్ సినిమా ఆగిపోయిందా?!

వ‌రుస విజ‌యాల‌తో ఊపుమీదున్నాడు… నితిన్‌. ఇటీవ‌ల విడుద‌లైన `హార్ట్ ఎటాక్‌`పై క్రిటిక్స్ పెద‌వి విరిచినా… చిత్రబృందం మాత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా మా సినిమా స‌క్సెస్ అయింద‌ని ప్రచారం చేసుకొంది. అయితే… యూత్ మాత్రం నితిన్ లుక్స్…

వ‌రుస విజ‌యాల‌తో ఊపుమీదున్నాడు… నితిన్‌. ఇటీవ‌ల విడుద‌లైన `హార్ట్ ఎటాక్‌`పై క్రిటిక్స్ పెద‌వి విరిచినా… చిత్రబృందం మాత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా మా సినిమా స‌క్సెస్ అయింద‌ని ప్రచారం చేసుకొంది. అయితే… యూత్ మాత్రం నితిన్ లుక్స్ చూసి ఫ‌ర్వాలేదు అన్న ముద్ర వేసింది. దీంతో  ఆ సినిమా సేఫ్ సైడ్ అయిపోయింది. 

నితిన్ ఆ వెంట‌నే మ‌రో సినిమాపై దృష్టిపెట్టాడు. సురేంద‌ర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాస్ ద‌ర్శక‌త్వంలో సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. ఆ సినిమాకి ఇటీవ‌ల కొబ్బరికాయ కూడా  కొట్టారు.  కానీ..  ఆ సినిమా ఆగిపోయింద‌ని తాజాగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్రచారం సాగుతోంది. క‌థ త‌యారు చేసిన విధానం న‌చ్చక‌పోవ‌డంతోనే నితిన్ ఆ సినిమాకి బ్రేక్ వేశాడ‌ని తెలుస్తోంది. 

సొంత సంస్థలో ప్రారంభ‌మైన ఆ సినిమా ఆగిపోవ‌డంతో… నితిన్ ఇక క‌రుణాక‌ర‌న్ సినిమా ప‌నుల్లో ప‌డ్డాడ‌ట‌. కరుణాక‌ర‌న్‌తో ఓ ప్రేమ‌క‌థ చేయ‌డానికి నితిన్ అంగీక‌రించాడు. ప్రస్తుతం ఆ సినిమా ప‌నులు వేగం అందుకొన్నాయ‌ని, త్వర‌లోనే సినిమాకి కొబ్బరికాయ కొట్టబోతున్నార‌ని స‌మాచారం.