మొత్తానికి వ్యవహారం సెటిల్ అయింది. ఎంతోమంది పోటీపడినా, ఆఖరికి అంథదూన్ హిందీ సినిమా హక్కులు సుధాకర్ రెడ్డి-టాగోర్ మధుకే దక్కాయి. దీంతో ఆ సినిమా రీమేక్ కు మార్గం సుగమం అయింది. నితిన్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి డిసైడ్ అయి, హక్కుల కోసం ట్రయ్ చేసారు కాబట్టి, ఇంక హీరో ఎవరు అన్న క్వశ్చను లేదు.
నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలు ఓకె చేసాడు. భీష్మ సినిమా సగానికి పైగా పూర్తయింది. చంద్రశేఖర్ యేలేటి సినిమా ఓ షెడ్యూలు పూర్తయింది. వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రంగ్ దే సినిమా స్టార్ట్ కావాల్సి వుంది. భీష్మ సినిమా పూర్తయిన తరువాత మిగిలిన రెండు సినిమా గ్యాప్ లో అంథదూన్ రీమేక్ చేస్తాడని బోగట్టా.
అయితే తెలుగు రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది చూడాలి. సుధీర్ వర్మ పేరు వినిపిస్తోంది. కానీ వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చిన ఆయన ట్రాక్ రికార్డు దృష్ట్యా ఆ అవకాశం వుండకపోవచ్చు. ఆ మధ్య వచ్చిన ఏజెంట్ శ్రీనివాస్ సినిమా డైరక్టర్ వివేక్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.