నిత్యామీనన్‌ టాప్‌ హీరోయిన్‌ అయిపోయిందా.?

టాప్‌ 5 హీరోయిన్ల లిస్ట్‌లో ఇప్పటిదాకా చోటు దక్కించుకోలేకపోయిన నిత్యామీనన్‌, త్వరలోనే ఆ లిస్ట్‌లోకి చేరిపోతుందా.? ఏమో మరి, ఆమెకు వరుసగా వస్తోన్న ఆఫర్లుల చూస్తోంటే, టాప్‌ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ని అతి త్వరలోనే చూస్తామేమో.…

టాప్‌ 5 హీరోయిన్ల లిస్ట్‌లో ఇప్పటిదాకా చోటు దక్కించుకోలేకపోయిన నిత్యామీనన్‌, త్వరలోనే ఆ లిస్ట్‌లోకి చేరిపోతుందా.? ఏమో మరి, ఆమెకు వరుసగా వస్తోన్న ఆఫర్లుల చూస్తోంటే, టాప్‌ హీరోయిన్‌గా నిత్యామీనన్‌ని అతి త్వరలోనే చూస్తామేమో.

ఒక్క ఛాన్స్‌.. అదీ టాప్‌ 5లో వున్న స్టార్‌ హీరోతో దక్కితే, తాను స్టార్‌ హీరోయిన్‌ అయిపోవడం ఖాయమనుకున్న నిత్యామీనన్‌కి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో, అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో సమంతని నటనలోనూ, గ్లామర్‌లోనూ దాటేసింది నిత్యామీనన్‌. ఆ వెంటనే ‘ఓకే బంగారం’ సినిమాతో నిత్యామీనన్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

బ్యాక్‌ టూ బ్యాక్‌.. ఒకేసారి రెండు పెద్ద సినిమాలతో నిత్యామీనన్‌ ఆడియన్స్‌ ముందుకు రావడమే కాక, ‘టాలెంటెడ్‌ హీరోయిన్‌’ అన్పించుకుంది. నటనలో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న నిత్యామీనన్‌కి, సరైన కమర్షియల్‌ హిట్‌ దొరకాల్సి వుంది. ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’లో ముగ్గురు హీరోయిన్లున్నారు. అందులో నిత్యామీనన్‌ కూడా ఓ హీరోయిన్‌. ‘ఓకే బంగారం’ విషయానికొస్తే, ఇది స్ట్రెయిట్‌ తెలుగు సినిమా కాదు.

సో.. నిత్యా మీనన్‌ ఇంకా ఒక్క ఛాన్స్‌.. అదీ పెద్ద హీరో సినిమాలో హీరోయిన్‌గా సూపర్‌ ఛాన్స్‌కి కాస్త దూరంలోనే వుందన్నమాట. ఆ ఒక్క ఛాన్స్‌ నిత్యామీనన్‌కి దక్కితే ఆమె టాప్‌ హీరోయిన్‌ అయిపోవడం పెద్ద కష్టమేమీ కాదేమో.!